The Devils Chair: 'ది డెవిల్స్ చైర్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

The Devils Chair: ది డెవిల్స్ చైర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
x
Highlights

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాల రేంజ్‌లో హిట్లవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. కంటెంట్ కొత్తగా ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాల రేంజ్‌లో హిట్లవుతున్నాయి. చాలా మంది మేకర్స్ సైతం చిన్న బడ్జెట్‌లోనే మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కాగా, ఇప్పుడు తెలుగులో అలాంటి సినిమానే తెరకెక్కుతుంది.అదే 'ది డెవిల్స్ చైర్'. జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను గంగ సప్త శిఖర దర్శకత్వం వహించాడు.

బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకం పై కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ "సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు మా ది డెవిల్స్ చైర్ (The Devil's chair) పర్ఫెక్ట్ సినిమా. సరికొత్త పాయింట్ తో టెక్నికల్ గా అద్భుతంగా ఉండే చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా చిత్రం మంచి హిట్ అవ్వాలి" అని కోరుకున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ "మా ది డెవిల్స్ చైర్ (The Devil's chair) చిత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రం. అద్భుతమైన ఏ ఐ టెక్నాలజీ తో సరికొత్త కథ తో నిర్మిస్తున్నాము. ప్రతి సీన్ ను అద్భుతంగా రిచ్ విజువల్స్ తో రూపొందిస్తున్నాం. షూటింగ్ అంతా పూర్తి అయింది. మా చిత్రాన్ని 2025 ఫిబ్రవరి చివరి వరం లో విడుదల చేస్తాము" అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories