Andhra King Taluka: రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' షూటింగ్‌ లో జాయిన్ అయిన ఉపేంద్ర

Andhra King Taluka: రామ్ పోతినేని, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్‌ లో జాయిన్ అయిన ఉపేంద్ర
x
Highlights

Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.

Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ గ్లింప్స్‌లో సినిమా పట్ల అపారమైన అభిమానం ఉన్న యువకుడిగా రామ్ పోతినేని పాత్ర ప్రేక్షకుల మనసుల్ని తాకింది. గ్లింప్స్‌లో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర భారీ కటౌట్ రూపంలో కనిపించి మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.

ఈ చిత్రంలో ఉపేంద్ర పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇటీవల విడుదలైన ఆయన క్యారెక్టర్ పోస్టర్ ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పాత్రల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకతకు ప్రాధాన్యం ఇచ్చే ఉపేంద్ర, ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌ లో జాయిన్ అయ్యారు. ఆయన ఈ చిత్రంలో సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తోంది. ఇంత అద్భుతమైన తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా భారీ అంచనాలని పెంచుతోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సిద్ధార్థ నూని, మ్యూజిక్ వివేక్–మర్విన్. జాతీయ అవార్డు విజేత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.

Show Full Article
Print Article
Next Story
More Stories