GAMA Awards 2025: అంగరంగ వైభవంగా గామా అవార్డ్స్‌ 2025 రివీల్ ఈవెంట్ .. దుబాయ్‌ వేదికగా

GAMA Awards 2025: అంగరంగ వైభవంగా గామా అవార్డ్స్‌ 2025 రివీల్ ఈవెంట్ .. దుబాయ్‌ వేదికగా
x
Highlights

GAMA Awards 2025: గామా అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ తేదీ (జూన్ 7, 2025) దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించబోతున్నారు.

GAMA Awards 2025: ఫిబ్రవరి 16, 2025న గామా అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ అజ్మాన్, దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని, GAMA ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. ⁠ఈ వేడుకలో గామా ఆర్గనైజింగ్ కమిటీ, ప్రముఖ గాయకుడు శ్రీ రఘు కుంచె సమక్షంలో ఈవెంట్ తేదీ, వేడుకలను జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు.

గామా అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ తేదీ (జూన్ 7, 2025) దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించబోతున్నారు. జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు - శ్రీ ఏ. కొదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు - శ్రీ కోటి , ప్రముఖ సినీ దర్శకులు - శ్రీ బి. గోపాల్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్ద్స్ అందించనున్నారు. ⁠GAMA AWARDS చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త "శ్రీ కేసరి త్రిమూర్తులు" మాట్లాడుతూ.. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్న GAMA, ఇప్పుడు 2025 జూన్ 7న జరగబోయే 5వ ఎడిషన్ కు ప్రముఖ సినీ పెద్దలను,కళాకారులను విశిష్ట అతిధులుగా ఆహ్వానిస్తున్నామని, యూఏఈలోని తెలుగు ప్రజలకు ప్రత్యేక వినోదాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలుగు సినీ ప్రముఖులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు మరియు UAE ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతితెలుగు వారికి ధన్యవాదములు తెలియజేసారు.

ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా ఉన్న శ్రీ ఏ. కొదండ రామిరెడ్డి (దర్శకుడు), శ్రీ కోటి (సంగీత దర్శకుడు), శ్రీ బి. గోపాల్ (దర్శకుడు) ప్రత్యేకంగా పంపిన వీడియో సందేశాలు పంపించారు. వీరి సందేశంలో.. ప్రతి ఒక్కరూ GAMA గొప్పతనాన్ని, కళాకారుల ప్రతిభకు అందించే ప్రోత్సాహాన్ని గురించి వెల్లడించారు. కుంచె రఘు గారు మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ ఈ GAMA ఈవెంట్ అని అన్నారు. GAMA తో మాకు చాలా మంచి అనుబంధం ఉందని అన్నారు. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటారు అని చెప్పారు.

GAMA అవార్డ్స్ 2025 మెయిన్ ఈవెంట్ జూన్ 7, 2025న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత, కళా రంగ ప్రముఖులు, ప్రతిభావంతులు, సినీ పరిశ్రమకు చెందిన లెజెండ్స్ ఈ గామా అవార్డ్స్ 2025 లో పాల్గొననున్నారు. అవార్డ్స్, సంగీత ప్రదర్శనలు, అంతర్జాతీయ స్థాయి వినోద కార్యక్రమాలతో GAMA 2025 తెలుగు ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories