రజనీకాంత్‌ అభిమానులకు నిరాశ

రజనీకాంత్‌ అభిమానులకు నిరాశ
x
Highlights

* ఇప్పట్లో పార్టీని ప్రకటించలేనన్న సూపర్‌స్టార్‌ * అభిమానులు నన్ను క్షమించండి -రజనీకాంత్ * పార్టీ ప్రకటనపై ట్వీట్‌ చేసిన సూపర్‌స్టార్‌

రజనీకాంత్‌ అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూపర్‌స్టార్‌.. కీలక ప్రకటన చేశారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ప్రకటించలేనని ఆయన చెప్పారు. అభిమానులు తనను నన్ను క్షమించాలని.. ట్వీట్‌ చేశారు తలైవా.

ఈ నెల 31న పార్టీ పేరును ప్రకటిస్తానని గతంలో రజనీకాంత్‌ తెలిపారు. అయితే.. ఇటీవల ఆయన అస్వస్థతకు గురికావడం.. కొద్ది రోజులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందడం, ఆ తర్వాత డిశ్చార్జి అయి చెన్నైకి వెళ్లడం జరిగింది. తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజకీయ పార్టీ పేరును ఇప్పట్లో ప్రకటించడంలేదని ట్విట్టర్‌లో తెలిపారు.

అన్న వస్తాడని.. తమ జీవితాల్లో ఆనందం నింపుతాడని భావించిన ఫ్యాన్స్‌.. రజనీ నిర్ణయంతో ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. డిసెంబర్‌ 31 ఎప్పుడు వస్తుందో.. రజనీ పార్టీ పేరు ఎప్పుడు ప్రకటిస్తాడోనని.. ఏ పేరు పెడతాడోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులు.. తలైవా తాజా నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories