రేపు అన్నమయ్య 516వ వర్థంతి..

X
Highlights
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 516వ వర్థంతి సోమవారం తిరుమలలో జరగనుంది. టీటీడి అధ్వర్యంలో ఈ...
Raj31 March 2019 1:37 AM GMT
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 516వ వర్థంతి సోమవారం తిరుమలలో జరగనుంది. టీటీడి అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు .ఈ మేరకు నారాయణ గిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం జరగనుంది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య గురుపరం వరకు చెందిన అహోబిలం మఠానికి చెందిన 46వ పీఠాధిపతి మహాదేశికన్ స్వామి ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు.
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌తో పాటు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీనిధి, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు, భజన బృందాలు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించనున్నారు.
Next Story