ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
x
Highlights

కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం ధ్వజారోహణంతో ఉత్సవాలు...

కడప జిల్లా ఒంటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 8 నుండి తొమ్మిదిన్నర గంటల వరకు శేష వాహనసేవ జరగనుంది. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు అలాగే రాత్రి 8 నుండి తొమ్మిదిన్నర గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 14న శ్రీరామనవమి వేడుక జరగనుంది, ఇక 16న హనుమత్సేవ, 17న గరుడసేవ జరగనున్నాయి. 18న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. అనంతరం గజ వాహనసేవ నిర్వహిస్తారు. 19న రథోత్సవం నిర్వహిస్తారు. 21న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories