Atiratha Maharatha: అతిరథ మహారథులు అంటే ఎవరు? ఆ పదాల అసలు అర్థం తెలిస్తే అమ్మో అంటారు!

Atiratha Maharatha: పురాణాల ప్రకారం అతిరథ మహారథులు అంటే ఎవరు?
x

Atiratha Maharatha

Highlights

Atiratha Maharatha: పురాణాల ప్రకారం అతిరథ మహారథులు అంటే ఎవరు? యుద్ధ వీరుల సామర్థ్యాన్ని రథ, అతిరథ, మహారథులుగా ఎలా విభజించారో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

Atiratha Maharatha: సాధారణంగా ఎవరైనా ఇద్దరు కలిసి ఏదైనా ఘన విజయం సాధించారనుకోండి.. వారినిద్దరినీ కలిపి పొగడడం కోసం వాళ్ళు అతిరథ మహారథులండీ అని అంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఈ అతిరథ మహారథులు అనే పదాన్ని వాడేస్తుంటాం. అసలు ఈ పదానికి అర్ధం ఎమిటి? దీనిని ఎక్కడ.. ఏ సందర్భంలో వాడితే సరిగ్గా ఉంటుంది అనేది తెలుసుకుందాం.

ఈ అతిరథ మహారథులు అనే పదాలను మన పురాణాల్లో చాలా సందర్భాల్లో వాడడం కనిపిస్తుంది. యుద్ధంలో పాల్గొనే యోధుల బలం - పనితీరును కొలవడానికి ఈ పదాలను ప్రమాణాలుగా చెబుతారు. యుద్ధంలో ఒక యోధుడు ఒకేసారి ఎంత మంది ప్రత్యర్థులతో పోరాడగలడో దాని ఆధారంగా కొన్ని పదాలు వాడడం జరిగింది. ఒకరకంగా చెప్పాలంటే ఒక యోధుని పోరాట శక్తిని క్లాసిఫై చేయడం అన్న మాట. ఇందులో మొత్తం ఐదు వర్గాలు ఉన్నాయి, అవి వరుసగా రథం, అతిరథం, మహారథం, అతిమహారథం, మహామహారథం.

  • Atiratha Maharatha: రథ అనే పదం విషయానికి వస్తే, ఇది ఒకేసారి 5,000 మంది పురుషులతో పోరాడగల యోధుడిని సూచిస్తుంది. శిశుపాల, శకుని, సోమదత్తుడు, శిఖండి వంటి పాత్రలు ఈ కోవలోకి వస్తాయి.
  • రెండవది అతిరథుడు. ఈ శ్రేణికి చెందిన యోధుడు రథ కంటే 12 రెట్లు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాడు. అంటే, అతిరథుడు ఒకేసారి 60,000 మంది పురుషులతో పోరాడగలడు. లవ-కుశులు, ద్రుపాదులు, దుర్యోధనుడు వంటి శక్తివంతమైన యోధులు ఈ కోవలోకి వస్తారు.
  • మూడవది, మహారథుడు. వారు అతిరథుడి కంటే 12 రెట్లు ఎక్కువ శక్తివంతులు. ఒక మహారథుడు ఒకేసారి 7,20,000 మందితో పోరాడగలడు. నిజానికి, రాముడు, కృష్ణుడు, అర్జునుడు వంటి దైవిక, శక్తివంతమైన వీరులు ఈ మహారథ వర్గంలో చెబుతారు.
  • Atiratha Maharatha: నాల్గవది అతిమహారథం. ఈ యోధులు మహారథుల కంటే 12 రెట్లు ఎక్కువ శక్తివంతులు. అంటే, అతిమహారథులు ఒకేసారి 86,40,000 మంది పురుషులతో పోరాడగలరు. హనుమంతుడు, పరశురాముడు వంటి అవతారాలు, మానవాతీత బలం ఉన్నవారు ఈ ఉన్నత తరగతిలోకి వస్తారు.
  • ఐదవ శ్రేణి మహామహారథ. ఈ తరగతి అత్యున్నత యోధ సామర్థ్యాన్ని సూచిస్తుంది, ఇది అతిమహారథ కంటే గొప్ప ఆధిపత్యాన్ని సూచిస్తుంది.

అదండీ విషయం.. అతిరథ మహారథ అనే పదాలు కేవలం మామూలుగా ఉపయోగించే పదాలు కాదు. అవి గొప్ప వ్యక్తుల అసాధారణ బలం, పరాక్రమాన్ని సూచించే చారిత్రక.. పౌరాణిక పదాలు. ఈ పదాల నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుని, మనం వాటిని సానుకూలంగా ఉపయోగించాలి. ఎందుకంటే, ఏదో ఆషామాషీ విషయాల్లో ఇలా అతిరథ మహారథులు అనే పదాల్ని ఉపయోగించడం వలన లేని అతిని చూపించినట్టవుతుంది. పైన చెప్పిన విధంగా చూస్తే కనుక ఇప్పుడు కనీసం రథ అనే వర్గానికి చెందిన వారే లేరు.. ఇక అతిరథులు.. మహారథులు ఎవరు ఉంటారు చెప్పండి? ఏమంటారు?

Show Full Article
Print Article
Next Story
More Stories