Holi festival destinations: రంగుల హోలీని ఈ ప్రాంతాల్లో చూస్తే ఆ థ్రిల్లే వేరు..

Holi festival destinations: రంగుల హొలీ పండుగను భారత్ లో ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారంటే . .
x

Holi festival destinations

Highlights

Holi festival destinations: రంగుల హోలీని మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆయా సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. మనసును ఉల్లాసపరిచే అలాంటి ప్రత్యేక వేడుకలు జరిగే ప్రాంతాల్లో కొన్ని

Holi festival destinations: అందమైన రంగుల్ని చూస్తే మనసంతా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రపంచమంతా రంగుల్లో చూసే అవకాశం ఉండడమే మానవునికి గొప్ప వరం. రంగుల ప్రపంచంలో విహరించడం అందరికీ దొరికిన అద్భుతమైన అవకాశం. ఇక రంగుల పండుగ హొలీ అంటే అందరి మనసులు పులకరించి పోతాయి. మనకున్న పండుగల్లో హోలీకి ఉండే ప్రత్యేకత వేరు. ఆధ్యాత్మికతతో పాటు రంగులతో ఆడుకుంటూ చిన్నా.. పెద్దా వంటి తేడాలు లేకుండా శుభాకాంక్షలు చెప్పుకుంటూ గడపడం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. హొలీ పండుగ కోసం ఎన్నో కథలు.. ఆచారాలు మన దేశంలో ఉన్నాయి. అదేవిధంగా దేశంలో అన్ని చోట్లా హొలీ వేడుకలను ఒకే విధంగా జరుపుకొను. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయా ప్రాంతాలలో ఉండే ప్రత్యేకతలను రంగులకు జతచేర్చి హొలీ పండుగను స్థానికంగా సంబరంగా జరుపుకుంటారు. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుర - బృందావనం - హోలీ హృదయం

Holi festival destinations: అత్యంత సాంప్రదాయకంగా హోలీని జరుపుకునే ప్రాంతాలు మధుర, బృందావనాలు. శీకృష్ణుని జన్మ స్థలాలుగా చెప్పుకునే ఈ ప్రాంతాల్లో హోలీని అతి పెద్ద వేడుకగా నిర్వహిస్తారు. ఒక్కరోజు కాకుండా అక్కడి ఆలయాలలో ప్రత్యేకంగా కొన్నిరోజుల పాటు ఆయా ఆలయాల నియమాల ప్రకారం నిర్వహిస్తారు. భక్తి పాటలతో.. రంగుల వేడుకలతో ఇక్కడ హొలీ పండుగ జరుపుకుంటారు.

బర్సానా - లాత్మార్ హోలీ

మధుర సమీపంలోని బర్సానాలో హోలీని ప్రత్యేక వేడుకలా నిర్వహిస్తారు. లాత్మార్ హోలీగా వ్యవహరించే ఈ వేడుకలో ప్రత్యేకత ఏమిటంటే పురుషులను.. మహిళలు కర్రలు పట్టుకుని వెంటాడుతూ రంగులు చల్లుకుంటూ సందడి చేస్తారు. అంతేకాకుండా, ఇక్కడ కృష్ణుడి ఇతిహాసాలకు సంబంధించిన నాటకాలు, ప్రత్యేక స్కిట్స్ తో కళాకారులు అందరినీ అలరిస్తారు.

జైపూర్ - రాయల్ రాజస్థాన్ వేడుకలు

Holi festival destinations: రాజస్థాన్ లోని జైపూర్ లో హొలీ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుపుతారు. జైపూర్ ప్యాలెస్ ప్రాంగణాలతో పాటు హెరిటేజ్ హోటల్స్ లో సాంస్కృతిక కార్యక్రమాల సందడితో హొలీ వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు, జానపద సంగీతం మధ్య జరిపే రంగుల కేళి అందరిలోనూ జోష్ తీసుకువస్తుంది.

ఉదయపూర్ - సరస్సులు.. రాజప్రాసాదాల మధ్య రంగుల హోలీ

ఉదయపూర్ సంప్రదాయాన్ని ప్రకృతి సౌందర్యంతో మిళితం చేస్తుంది. హోలిక దహనం రోజున నగరంలో ఉత్సవంలా హోలికా దహనం నిర్వహిస్తారు. మరుసటి రోజు రంగు రంగుల వేడుకలు జరుపుతారు. ఉదయపూర్ సరస్సులు, రాజభవనాలు అందమైన దృశ్య మాలిక. అందుకే ఇక్కడ ఉత్సవాలతో పాటు రంగుల వేడుకను అద్భుతమైన నేపధ్యంగా ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడేవారికి అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

శాంతినికేతన్ - ఒక సాంస్కృతిక అనుభవం

పశ్చిమ బెంగాల్‌లో, శాంతినికేతన్ లో హోలీని బసంత ఉత్సవ్‌గా జరుపుకుంటారు. విద్యార్థులు పసుపు రంగు దుస్తులు ధరించి, నృత్యాలు చేస్తారు సందర్భానికి తగ్గ పాటలతో వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు. హొలీ పండుగ ఇక్కడ కళాత్మకంగా.. మనోహరంగా జరుగుతుంది.

2026 హోలీ వేడుకలకు చిట్కాలు

  • మీరు వెళ్లే ప్రాంతంలో ముందుగానే వసతిని బుక్ చేసుకోండి.
  • సౌకర్యవంతమైన కాటన్ దుస్తులను ధరించండి.
  • కెమెరాలు - ఫోన్‌లను రంగు పౌడర్ల నుండి రక్షించుకునే ఏర్పాట్లు చేసుకోండి.
  • 2026 హోలీ ప్రయాణం అంటే మీ మనసుకు నచ్చే చక్కని ప్రదేశాన్ని ఎంచుకుని పండుగను ఆస్వాదించండి.
  • అన్నట్టు రంగుల వేడుకలో జాగ్రత్తగా వ్యవహరించండి. సింథటిక్ రంగులకు దూరంగా ఉండండి.

Show Full Article
Print Article
Next Story
More Stories