Top
logo

అబుదాబిలో తొలి హిందూ ఆలయం

అబుదాబిలో తొలి హిందూ ఆలయం
X
Highlights

మనదేశంలోనే కాదు విదేశాల్లో సైతం హిదుత్వం పరిమళిస్తుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుదాబిలో...

మనదేశంలోనే కాదు విదేశాల్లో సైతం హిదుత్వం పరిమళిస్తుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రాజధాని అబుదాబిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి శనివారం అంకురార్పణ జరిగింది. అబుదాబిలో నివసిస్తున్న వేలాదిమంది భారతీయుల సమక్షంలో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ ఆలయాన్ని బోచసన్‌వాసి శ్రీ అక్షర్‌–పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) అధిపతి మహాంత్‌ స్వామి మహారాజ్‌ నిర్మిస్తున్నారు. శనివారం ఆయనే గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి–దుబాయ్‌ హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆర్ట్‌ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు.

Next Story