బాణసంచా చూపెట్టే "రంగులకల" ఎలా!

బాణసంచా చూపెట్టే రంగులకల ఎలా!
x
Highlights

దీపావళికి పండుగ రోజు, లేదా కొన్ని వేడుకల్లో కాల్చే బాణసంచా వెలుగుల్లో రకరకాల రంగులెలా వస్తాయో మీకు తెలుసా? మనము బాణసంచా కాల్చినప్పుడు వెలువడే రంగులకు...

దీపావళికి పండుగ రోజు, లేదా కొన్ని వేడుకల్లో కాల్చే బాణసంచా వెలుగుల్లో రకరకాల రంగులెలా వస్తాయో మీకు తెలుసా? మనము బాణసంచా కాల్చినప్పుడు వెలువడే రంగులకు కారణం రకరకాల రసాయన పదర్థాలే. బాణసంచాను సాధారణంగా పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌, బొగ్గు పొడి మిశ్రమంతో తయారు చేస్తారు. ఇవి చాలా వరకు ధ్వనులను ఉత్పన్నం చేస్తాయి. ఇక లోహలవణాలైన స్ట్రాంషియమ్‌, బేరియం రంగులను వెదజల్లుతాయి. ఈ లవణాలను పొటాషియం క్లోరేట్‌తో కలుపుతారు. బేరియం లవణాలు ఆకుపచ్చ రంగును, స్ట్రాంషియమ్‌ కార్బొనేట్‌ పసుపు వర్ణాన్ని, స్ట్రాంషియమ్‌ నైట్రేట్‌ ఎరుపు రంగును వెదజల్లుతాయట. అలా శబ్దాలు వినడమే కాదు, రంగులని కూడా చూస్తాము, కాని ఎన్నో డబ్బులు ఈ బాణసంచా రూపంలో కాలిపోతున్నట్టే కదా! శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories