భయంకర వైరస్ లాప్ టాప్ అక్షరాలా 8కోట్లు

భయంకర వైరస్ లాప్ టాప్ అక్షరాలా 8కోట్లు
x
Highlights

ఎక్కడన్నా ప్రమాదమంటే ఆమడ దూరం పారిపోతాం. ప్రమాదకరమైన వస్తువు అంటే అమ్మో అంటూ పక్కకి జరిగిపోతాం. కానీ, ప్రమాదకరమని తెలిసీ కోట్లు పెట్టి ఏదన్నా...

ఎక్కడన్నా ప్రమాదమంటే ఆమడ దూరం పారిపోతాం. ప్రమాదకరమైన వస్తువు అంటే అమ్మో అంటూ పక్కకి జరిగిపోతాం. కానీ, ప్రమాదకరమని తెలిసీ కోట్లు పెట్టి ఏదన్నా వస్తువును కొంటారా ఎవరైనా? కొట్లేంటి వంద రూపాయలు కూడా పెట్టి కోణం అంటారా? అయితే ఈ వివరాలు చదివేయండి మీరు వెంటనే

వామ్మో.. అనకపోతే ఒట్టు!

అది ఒక లాప్ టాప్. విండోస్‌ ఎక్స్‌పీ ఆధారిత శాంసంగ్‌ ఎన్‌సీ10 దీని పేరు.10.2 అంగుళాల 14జీబీ (2008) డివైస్‌. ఆరు భయంకరమైన వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌ తిష్టవేశాయి. అందుకే దీనిని ప్రపంచంలోనే ప్రమాదాకర లాప్ టాప్ గా పేర్కొన్నారు. ఇందులో ఉన్న వైరస్ లు ప్రపంచానికి 100 బిలియన్‌ డాలర్ల నష్టం చేశాయి.

ఐ లవ్‌యూ, మైడూమ్‌, సోబిగ్‌, వాన్నా క్రై, డార్క్ టెక్విలా బ్లాక్ఎనర్జీ అనే ఆరు వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో దాగి వున్నాయి. 'ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్' అనే శీర్షికతో, గ్వోఓ ఓ డోంగ్‌ దీన్ని సృష్టించారు. అంత ప్రమాదకరమైన ఈ లాప్ టాప్ ను ఆన్లైన్ లో వేలం వేశారు. వేలం లో దీని ధర ఎంత పలుకుతోందో తెలుసా? ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న ప్రైవేట్ వేలంలో ఇది ఇప్పటికే 1.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8 కోట్ల, 34 లక్షలు) ధర పలుకుతోంది. అద్భుతమైన ఈ ఆర్ట్‌పీస్‌పై ఆసక్తి వున్నవారు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు.

సెక్యూరిటీ సంస్థ డీప్‌ ఇన్‌స్టింక్ట్‌ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్‌నెట్‌ ఆర్టిస్ట్‌ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అతి ప్రమాదకరమైన ఆరు వైరస్‌లను లైవ్లీగా ఉంచి మరీ, ఈ డివైస్‌ను వేలానికి వుంచారు. డిజిటల్‌ ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును భౌతికంగా ప్రజలకు తెలియ చెప్పేందుకే ఈ ప్రయత్నమని గ్వో చెప్పారు. కంప్యూటర్‌లోని భయంకరమైన వైరస్‌లు మనల్ని భౌతికంగా ప్రభావితం చేయలేవని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ అవి ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో గమనించలేక పోతున్నారన్నారు. అందుకే ఆర్థికంగా భారీ నష్టాన్ని కలుగ జేసిన ఈ ఆరు భయంకరమైన వైరస్‌లను ఎంచుకున్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories