Cars In India: ఈ 4 కార్లకు జీరో వెయిటింగ్‌ పీరియడ్‌.. వెంటనే కొనుగోలు చేయొచ్చు..!

Zero Waiting Period For These 4 Cars Can Be Bought Immediately
x

Cars In India: ఈ 4 కార్లకు జీరో వెయిటింగ్‌ పీరియడ్‌.. వెంటనే కొనుగోలు చేయొచ్చు..!

Highlights

Cars In India: కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది కార్లు కొనడానికి మొగ్గు చూపుతున్నారు.

Cars In India: కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది కార్లు కొనడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే దేశంలో కార్లకి డిమాండ్ పెరిగింది. కంపెనీలు కూడా అందుకు తగ్గట్లే కొత్త కొత్త బ్రాండ్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అయితే పండగ సమయంలో ఇష్టమైన కారు కొనాలంటే కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే వెయిటింగ్‌ పీరియడ్‌ అనేది కస్టమర్లను చాలా నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఆఫర్లను వినియోగించుకోవాలంటే కూడా రోజుల తరబడి కారు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా కాదు షోరూం వెళ్లి ఒక్క రోజులో కారును ఇంటికి తీసుకురావచ్చా అంటే అది సాధ్యమే. కొన్ని కార్లకు జీరో వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంది. అలాంటి కార్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

టాటా టియాగో..

ఈ కారు దేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటి. ఇది కాంపాక్ట్ డిజైన్ లో ఉంటుంది. ఇందులో మూడు సిలెండర్ల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అలాగే సీఎన్జీ పవర్ ట్రైన్ కూడా ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్సులతో అందుబాటులో ఉంది. ఈ కారు మీకు కావాలంటే జీరో వెయిటింగ్ పీరియడ్ తో వస్తుంది.

హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

ఇది టాటా టియాగో కేటగిరీలోకే వస్తుంది. ఈ కారు సౌత్ కొరియా కార మేకర్ అయిన హ్యూందాయ్ కి మంచి లాభాలు తెచ్చే పెట్టే కారు. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలలో లభిస్తుంది. మాన్యువల్, ఏఎంటీ ట్రాన్సిమిషన్ లలో అందుబాటులో ఉంది. ఈ కారును డబ్బు చెల్లించి వెంటనే ఇంటికి తీసుకురావచ్చు.

రెనాల్ట్ క్విడ్

ఈ ఫ్రెంచ్ కార్ దేశంలో లాంచ్ అయిన దగ్గర నుంచి మంచి సేల్స్ నే రాబట్టింది. అయితే 800 సీసీ ఇంజిన్ కారును డిస్కకంటిన్యూ చేసిన తర్వాత ప్రస్తుతం ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ పవర్ ట్రైన్ తో అందుబాటులో ఉంది. ఇది కూడా మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ కారుకు ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేదు. డబ్బులు చెల్లించి వెంటనే ఇంటికి తీసుకురావచ్చు.

మారుతి సుజుకీ జిమ్నీ

మారుతి సుజుకీ నుంచి 2023లో లాంచ్ అయిన ముఖ్యమైన కార్లలో ఇదీ ఒకటి. ఇది ఐదు డోర్లతో వస్తుంది. ఈ కారును ప్రత్యేకంగా డెవలప్ మెంట్ చేశారు. దీనిని మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించారు. ఇది జీటా, ఆల్ఫా ట్రిమ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఎస్ యూవీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది తక్కువ వెయిటింగ్ పీరియడ్ తో లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories