Xiaomi YU7 EV: రయ్ మంటూ దూసుకుపోవడమే.. గంటకు 253 కి.మీ వేగం.. 835 కి.మీ మైలేజ్..!

Xiaomi YU7 EV Launch Soon With 835 km Range
x

Xiaomi YU7 EV: రయ్ మంటూ దూసుకుపోవడమే.. గంటకు 253 కి.మీ వేగం.. 835 కి.మీ మైలేజ్..!

Highlights

Xiaomi YU7 EV: భారతదేశంలో రాబోయే కాలంలో ఈవీలు చాలా అధునాతనంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు 500 కి.మీ పరిధిని ప్రామాణికంగా పరిగణించేవారు కానీ ఇప్పుడు అది 800 కి.మీ కంటే ఎక్కువకు పెరగబోతోంది.

Xiaomi YU7 EV: భారతదేశంలో రాబోయే కాలంలో ఈవీలు చాలా అధునాతనంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు 500 కి.మీ పరిధిని ప్రామాణికంగా పరిగణించేవారు కానీ ఇప్పుడు అది 800 కి.మీ కంటే ఎక్కువకు పెరగబోతోంది. ప్రజలు ఇంధన ఆధారిత కార్లను శాశ్వతంగా వదిలివేయడానికి ఇది ఒక పెద్ద కారణం అవుతుంది. ఇప్పుడు షియోమి తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Xiaomi YU7 EV ను ప్రపంచ స్థాయిలో ప్రవేశపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారు సేల్స్ ఈ సంవత్సరం జూలైలో ప్రారంభమవుతాయి. ఇది ఆ కంపెనీకి చెందిన రెండవ ఎలక్ట్రిక్ కారు.

దీనికి ముందు, కంపెనీ తన మొదటి సెడాన్ SU7ను విడుదల చేసింది, అందులో 2.58 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు. ఇప్పుడు షియోమి YU7 లాంచ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. ఈ కారు టెస్లా మోడల్ Y కంటే చాలా విధాలుగా మెరుగ్గా ఉంటుంది. ఈ షియోమి కారులో ఎటువంటి ఫీచర్లు ఉంటాయో తెలుసుకుందాం.

కొత్త షియోమి YU7 మూడు వేరియంట్లలో లభిస్తుంది, అవి స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్. దీని స్టాండర్డ్ (RWD) వేరియంట్ 96.3 కిలోవాట్ LFP బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది, ఇది ఒకే ఛార్జ్‌లో 835 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ పరిధిని ఇస్తుంది. 320 పిఎస్ పవర్ రిలీజ్ చేస్తుంది. ఇది కాకుండా, ప్రో (AWD) లో 96.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది ఒకే ఛార్జ్‌లో 770 కి.మీ వరకు డ్రైవింగ్ పరిధిని ఇస్తుంది. 496 పిఎస్ పవర్ అందిస్తుంది. మాక్స్ (AWD) 101.7 కిలోవాట్ NCM బ్యాటరీ ప్యాక్‌తో శక్తిని పొందుతుంది, ఇది 760 కి.మీ వరకు డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది, 690 పిఎఎస్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం గంటకు 253 కి.మీ.గా ఉంటుందని అంచనా.

కొత్త షియోమి YU7 డిజైన్ స్పోర్టిగా ఉంటుంది. దీని డిజైన్ కర్వ్‌డ్ బాడీలో ఉంటుంది. ఇది వాటర్‌డ్రాప్ హెడ్‌లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, టేపరింగ్ రూఫ్‌లైన్, కనెక్ట్ చేసిన టెయిల్ ల్యాంప్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది కాకుండా ముందు భాగంలో 123 డిగ్రీల రిక్లైన్, 10-పాయింట్ మసాజ్ ఫంక్షన్ లెదర్ సీట్లను చూడచ్చు.

అంతే కాకుండా అన్ని కంట్రోల్స్ కోసం 16.1-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ అందించారు. వెనుక ప్రయాణీకులకు 135-డిగ్రీల అడ్జస్ట్ సీట్లు, 6.68-అంగుళాల టచ్ ప్యానెల్ లభిస్తాయి. ప్రయాణీకుల భద్రత కోసం, ఈ కారులోని అడాస్ సిస్టమ్‌లో 1 LiDAR, 1 4D మిల్లీమీటర్-వేవ్ రాడార్, 12 అల్ట్రాసోనిక్ సెన్సార్లు, 11 HD కెమెరాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories