Electric Vehicles: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని నడపొచ్చు.. ఎటువంటి చలాన్ పడదండోయ్.. ధర, ఫీచర్లు తెలిస్తే పరేషానే..!

without Driving Licence people can drive electric scooters in India check auto news in Telugu
x

Electric Vehicles: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని నడపొచ్చు.. ఎటువంటి చలాన్ పడదండోయ్.. ధర, ఫీచర్లు తెలిస్తే పరేషానే..!

Highlights

Without Driving Licence: ద్విచక్ర వాహనాలు సామాన్యుల జీవితంలో ఒక భాగం. ప్రజా రవాణా, ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడకుండా, మన స్వంత బైక్ లేదా స్కూటర్‌ను కలిగి ఉండటం ద్వారా డబ్బు, సమయాన్ని ఆదా చేయవచ్చు.

Without Driving Licence: ద్విచక్ర వాహనాలు సామాన్యుల జీవితంలో ఒక భాగం. ప్రజా రవాణా, ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడకుండా, మన స్వంత బైక్ లేదా స్కూటర్‌ను కలిగి ఉండటం ద్వారా డబ్బు, సమయాన్ని ఆదా చేయవచ్చు. డ్రైవింగ్‌ చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం పొందడంలో మాత్రం ఆసక్తి చూపరు.

ఇటువంటి పరిస్థితిలో, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా నడపగలిగే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో తక్కువ వేగంతో నడిచే ద్విచక్ర వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

అంటే 25 కి.మీ వేగంతో ప్రయాణించే ద్విచక్ర వాహనాలకు లైసెన్స్ అవసరం లేదు. ప్రస్తుతం, భారతదేశంలోని కొన్ని కంపెనీలు ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్నాయి. మీరు లైసెన్స్ లేకుండా గంటకు 25 కిమీ వేగంతో మాత్రమే డ్రైవ్ చేయవచ్చు.

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్: హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ 28 Ah లెడ్-అసిటేట్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కి.మీ. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ భారతదేశంలో రూ. 59,640 (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఇందులో 250 వాట్స్‌తో కూడిన చిన్న BLDC హబ్ మోటార్‌ను ఉపయోగించారు.

కైనెటిక్ జింగ్: భారతీయ మార్కెట్లో కైనెటిక్ జింగ్ ధర రూ. 71,990 నుంచి రూ. 84,990 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 22 Ah బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిమీల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Komaki XGT KM: Komaki XGT KM స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 85 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇ-స్కూటర్ ధర రూ. 56,890 నుంచి రూ. 93,045 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Hero Eddy: Hero Eddy 85 కిమీల పరిధిని అందిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. భారతదేశంలో దీని ధర రూ. 72,000 (ఎక్స్-షోరూమ్). ఇది 30 Ah బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిమీ మాత్రమే.

ఒకినావా R30: Okinawa R30 EV స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ. పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.61,998. ఇందులో 1.25 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు.

డెల్టిక్ డ్రిక్స్: డెల్టిక్ డ్రిక్స్ 1.58 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 70 కిమీ నుంచి 100 కిమీల పరిధిని అందిస్తుంది. ఇది భారతదేశంలో రూ. 58,490 నుంచి రూ. 84,990 (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది.

ఒకినావా లైట్: భారత మార్కెట్లో ఒకినావా లైట్ ధర రూ. 74,999 (ఎక్స్-షోరూమ్). ఇది 1.25 kWh తొలగించగల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీని రైడింగ్ రేంజ్ 60 కిలోమీటర్లు. పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories