Pulsar N150 : భారత్‌లో ఈ బైక్ ప్రయాణం ముగిసింది.. హడావుడి లేకుండా నిలిపివేసిన బజాజ్ సంస్థ

Pulsar N150
x

Pulsar N150 : భారత్‌లో ఈ బైక్ ప్రయాణం ముగిసింది.. హడావుడి లేకుండా నిలిపివేసిన బజాజ్ సంస్థ

Highlights

Pulsar N150 : బజాజ్ ఆటో తన ప్రముఖ పల్సర్ సిరీస్ బైక్‌లలో ఒకటైన పల్సర్ N150ను ఎలాంటి హడావుడి లేకుండా నిలిపివేసింది. ఇప్పుడు ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా తొలగించారు.

Pulsar N150 : బజాజ్ ఆటో తన ప్రముఖ పల్సర్ సిరీస్ బైక్‌లలో ఒకటైన పల్సర్ N150ను ఎలాంటి హడావుడి లేకుండా నిలిపివేసింది. ఇప్పుడు ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా తొలగించారు. ఈ నిర్ణయం బైక్ ప్రియులను కొంచెం ఆశ్చర్యపరిచినప్పటికీ, దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాం. బజాజ్ పల్సర్ N150 ను నిలిపివేయడానికి కొన్ని స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఈ బైక్ మార్కెట్లో తనదైన స్థానాన్ని ఏర్పరచుకోవడంలో విఫలమైంది. పల్సర్ N150 ని పల్సర్ 150, N160 మధ్య ఉంచారు. కానీ, ఇది సాంప్రదాయ కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది, అలాగే పర్ఫామెన్స్ ఇష్టపడే యువకులను కూడా ఆకర్షించలేకపోయింది. రెండు వైపులా ఉన్న బైక్‌ల మధ్య తన ప్రత్యేకతను చాటుకోలేకపోయింది.

N150 ధర N160 కి చాలా దగ్గరగా ఉంది. అయితే N160 మెరుగైన పవర్, డ్యూయల్-ఛానల్ ABS, మరిన్ని ఫీచర్లను అందించింది. దీంతో వినియోగదారులు సహజంగానే N160 వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే తక్కువ ధర వ్యత్యాసంతో ఎక్కువ ఫీచర్లు లభిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సింగిల్ సీట్ N160 మోడల్, N150 బెనిఫిట్స్ మరింత తగ్గించింది. N160 మరింత లేటెస్ట్ డిజైన్, మెరుగైన ఫీచర్లను అందిస్తూ, N150 ని మార్కెట్లో బలహీనపరిచింది. ఫలితంగా, N150 కస్టమర్లను ఆకర్షించలేకపోయింది.

బజాజ్ పల్సర్ N150 స్పెసిఫికేషన్లు

బజాజ్ పల్సర్ N150 బైక్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 149.68cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. 8,750 rpm వద్ద 15.68 bhp పవర్ అందిస్తుంది. 6,750 rpm వద్ద 14.65ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ అందించారు. ప్రస్తుతానికి, N150 కి బదులుగా ఏ కొత్త మోడల్‌ను తీసుకువస్తామని కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, బజాజ్ పల్సర్ శ్రేణిని విస్తరిస్తున్న తీరును బట్టి చూస్తే, భవిష్యత్తులో ఒక కొత్త, ప్రత్యేకమైన మోడల్‌ను మనం చూడవచ్చు. బజాజ్ ఎల్లప్పుడూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తుంది. కాబట్టి N150 స్థానంలో మరింత ఆకర్షణీయమైన ప్రొడక్ట్ వస్తుందని ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories