Router Direction: స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం రూటర్‌ని ఎక్కడ పెట్టాలి.. ఈ సమాచారం తెలుసుకోండి..!

Where To Install Router For Speed Internet Know This Information
x

Router Direction: స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం రూటర్‌ని ఎక్కడ పెట్టాలి.. ఈ సమాచారం తెలుసుకోండి..!

Highlights

Router Direction: మీ ఇంట్లో ఫైబర్ కనెక్షన్ ఉంటే దాని వేగం చాలాసార్లు స్లో అవుతుంది.

Router Direction: మీ ఇంట్లో ఫైబర్ కనెక్షన్ ఉంటే దాని వేగం చాలాసార్లు స్లో అవుతుంది. పదే పదే ఇలాగే జరిగితే అసహనానికి గురికావాల్సి ఉంటుంది. అంతేకాదు ఏదైనా ఇంటర్నెట్‌కి సంబంధించిన పనిచేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు మీరు పనిని పూర్తి చేయలేరు. వెంటనే మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం. మీరు ఈ సమస్యను నివారించాలంటే WiFi రూటర్‌ని సరైన దిశలో అమర్చాలి. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.

మీరు ఇంటిలోని హాల్ ప్రాంతంలో WiFi రూటర్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. దీనివల్ల దాదాపు ఇంటిలోని ప్రతి మూలలో మీరు ఇంటర్నెట్ స్పీడ్‌ను పొందుతారు. వాస్తవానికి వైఫై రూటర్‌ని బహిరంగ ప్రదేశంలో ఇన్‌స్టాల్ చేయడం వల్ల వైఫై పరిధి పెరుగుతుంది. ప్రతి గదిలో మంచి కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. అదే మీరు ఏదైనా ఒక గదిలో రూటర్‌ని ఫిక్స్‌ చేస్తే అన్ని గదులలోకి ఇంటర్నెట్‌ రాకపోవచ్చు. అందుకే మంచి కనెక్టివిటీ కావాలంటే తప్పనిసరిగా ఇంట్లోని హాల్ ప్రాంతంలో WiFi రూటర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

అలాగే మీరు 3 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఇంటిలో నివసిస్తుంటే ఇంటిలోని ప్రతి అంతస్తులో అద్భుతమైన కనెక్టివిటీని కోరుకుంటే WiFi రూటర్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రూటర్ స్థానాన్ని సరైన స్థలంలో సెట్ చేస్తే బహుళ-అంతస్తుల ఇంట్లో కూడా మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఇల్లు బహుళ అంతస్థులైతే వైఫై రూటర్‌ను మధ్య అంతస్తులో అమర్చేలా ఏర్పాటు చేయాలి. దీనివల్ల పై అంతస్తు, దిగువ అంతస్తు రెండూ మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఇంటి మొత్తానికి ఇంటర్నెట్‌ను అమలు చేసినవారవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories