Volkswagen Golf GTi Bookings Open: మెంటల్ ఎక్కే ఫీచర్లతో వోక్స్‌వ్యాగన్ సూపర్ కారు.. బుకింగ్స్ ఓపెన్..!

Volkswagen Golf GTi Bookings Open
x

Volkswagen Golf GTi Bookings Open: మెంటల్ ఎక్కే ఫీచర్లతో వోక్స్‌వ్యాగన్ సూపర్ కారు.. బుకింగ్స్ ఓపెన్..!

Highlights

Volkswagen Golf GTi Bookings Open: వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTi మే 2025 చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది.

Volkswagen Golf GTi Bookings Open: వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTi మే 2025 చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది. దాని ప్రారంభానికి ముందే బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. కంపెనీ మే 5, 2025 నుండి వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTi బుకింగ్‌లను ప్రారంభించబోతోంది. దీనిని మొదటిసారిగా భారతదేశానికి తీసుకువస్తున్నారు. ఇది భారతదేశంలో వోక్స్‌వ్యాగన్ నుండి వచ్చిన రెండవ GTi-బ్యాడ్జ్ మోడల్ కానుంది. ఇంతకు ముందు, 3-డోర్ల పోలో GTI ప్రారంభించారు. ఇది పూర్తిగా దిగుమతి చేసుకోబోతోంది, దీని కారణంగా GTi ఖరీదైనది అవుతుంది. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTi‌లో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Volkswagen Golf GTi Engine

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTi 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 265హెచ్‌పి పవర్, 370ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఫ్రంట్-యాక్సిల్ డిఫరెన్షియల్ లాక్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Volkswagen Golf GTi Design

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTi డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, GTi బ్యాడ్జ్‌లు, వెనుక భాగంలో ట్విన్ ఎగ్జాస్ట్ టిప్‌ల, స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంది. దీనిలో డ్యూయల్-టోన్ ఫ్రంట్ బంపర్‌పై ఐదు-ముక్కల లైటింగ్ ఎలిమెంట్‌ ఉంది. దాని ఎల్‌ఈడీ డీఆర్ఎల్, హెడ్‌ల్యాంప్‌ల నుండి విస్తరించి గ్రిల్ వైపు కదులుతాయి. ఇది మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. భారతదేశంలో గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్, ఓరిక్స్ వైట్ ప్రీమియం, మూన్‌స్టోన్ గ్రే బ్లాక్, కింగ్స్ రెడ్ ప్రీమియం అనే నాలుగు కలర్ ఆప్షన్స్‌తో విడుదలవుతుంది.

Volkswagen Golf GTi interior

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTi లోపలి భాగం కంపెనీ ఇటీవల విడుదల చేసిన టిగువాన్ R లైన్‌ని పోలి ఉంటుంది. ఇది 15-అంగుళాల పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్, 10.3-అంగుళాల ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. దీనికి GTi-స్పెక్ స్టీరింగ్ వీల్, GTi బ్రాండింగ్‌తో స్పోర్ట్స్ సీట్లు కూడా లభిస్తాయి.

Volkswagen Golf GTi Price

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTi ని భారత మార్కెట్లో దాదాపు రూ. 50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేయవచ్చు. మొదటి బ్యాచ్‌లో కంపెనీ 250 యూనిట్లను దిగుమతి చేసుకుంది. భారతదేశంలో ప్రారంభించిన తర్వాత, ఇది మినీ కూపర్ S తో పోటీపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories