Upcoming Hybrid SUVs: హైబ్రిడ్ ఎస్‌‌యూవీలకు పెరుగుతున్న ఆదరణ.. త్వరలో లిస్ట్‌లోకి మూడు సూపర్ కార్లు!

Upcoming Hybrid SUVs
x

Upcoming Hybrid SUVs: హైబ్రిడ్ ఎస్‌‌యూవీలకు పెరుగుతున్న ఆదరణ.. త్వరలో లిస్ట్‌లోకి మూడు సూపర్ కార్లు!

Highlights

Upcoming hybrid SUVs in India: గత కొన్నేళ్లుగా దేశంలో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. మైలేజీ పరంగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల కంటే హైబ్రిడ్ కార్లు మంచి మైలేజీని అందిస్తాయి. రోజువారీ ఉపయోగం కోసం ఇవి మంచి ఆప్షన్.

Upcoming Hybrid SUVs: గత కొన్నేళ్లుగా దేశంలో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. మైలేజీ పరంగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల కంటే హైబ్రిడ్ కార్లు మంచి మైలేజీని అందిస్తాయి. రోజువారీ ఉపయోగం కోసం ఇవి మంచి ఆప్షన్. హైబ్రిడ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి కార్ల కంపెనీలు కూడా వేగంగా పనిచేస్తున్నాయి. రాబోయే 3 హైబ్రిడ్ ఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్

ఈ సంవత్సరం హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ క్రెటాను ఆటో ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది, దీనికి వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు కంపెనీ హైబ్రిడ్ క్రెటాపై పని చేస్తోంది. క్రెటా త్వరలో దేశంలో విడుదల చేయనుంది. కొత్త మోడల్ ఇంటర్నల్ కోడ్‌నేమ్ SX3. కొత్త క్రెటాలో బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేసిన 1.5-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉండచ్చు. దీనితో పాటుగా కంపెనీ పెట్రోల్,డీజిల్ ఇంజన్లతో కొత్త క్రెటాను కూడా విడుదల చేయవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

కియా సెల్టోస్ హైబ్రిడ్

కియా ఇండియా హైబ్రిడ్ టెక్నాలజీతో తన ఫేమస్ ఎస్‌యూవీ సెల్టోస్ తదుపరి తరం మోడల్‌ను కూడా తీసుకువస్తోంది. ఇటీవల టెస్టింగ్ సమయంలో ఈ కారు కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం.. కొత్త సెల్టోస్‌లో బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఇవ్వచ్చు. సెల్టోస్ ఇప్పటికే ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను హైబ్రిడ్ సెటప్‌తో రావచ్చు.

టయోటా హైరైడర్ 7-సీటర్ ఎస్‌యూవీ

టయోటా ఈ సంవత్సరం లేదా వచ్చే ఏడాది అర్బన్ క్రూయిజర్ హెయిరైడర్ 7-సీటర్ వెర్షన్‌ను విడుదల చేయచ్చు. టయోటా హైబ్రిడ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా 7-సీటర్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఎస్‌‌యూవీ కోడ్‌నేమ్ Y1. ఈ కారు హైబ్రిడ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. మైలేజ్ 30కిమీ కంటే ఎక్కువగా ఉంటుంది. హైరైడర్ 7-సీటర్‌లో 1.5-లీటర్ K15C నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ , 1.5-లీటర్ బలమైన హైబ్రిడ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories