Upcoming Electric SUV: కాస్త పక్కకు జరగాలమ్మా.. సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దూసుకొస్తున్నాయ్..!

Upcoming Electric SUV
x

Upcoming Electric SUV: కాస్త పక్కకు జరగాలమ్మా.. సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు దూసుకొస్తున్నాయ్..!

Highlights

Upcoming Electric SUV: 2025 సంవత్సరం ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా ప్రత్యేకమైనది. మారుతి సుజుకి నుండి మహీంద్రా వరకు, ప్రతి కంపెనీ ఈ సంవత్సరం వారి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించబోతున్నాయి.

Upcoming Electric SUV: 2025 సంవత్సరం ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా ప్రత్యేకమైనది. మారుతి సుజుకి నుండి మహీంద్రా వరకు, ప్రతి కంపెనీ ఈ సంవత్సరం వారి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించబోతున్నాయి. కొన్ని వాహనాలను ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. తయారీదారులకు ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తోంది. ఇండియన్ ఆటో మార్కెట్లో ప్రతి ఒక్కరూ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఈ సంవత్సరం కొత్త ఆవా కొనాలని ఆలోచిస్తుంటే, ఈ సంవత్సరం లాంచ్ చేయబోయే కార్ల గురించి తెలుసుకుందాం.

Tata Harrier EV

టాటా మోటార్స్ ఈ ఏడాది జూన్ 3న తన హారియర్ ఈవీని విడుదల చేయబోతోంది. ఈ కారును మొదట ఆటో ఎక్స్‌పో 2025లో ప్రవేశపెట్టారు. ఈ ఎస్‌యూవీని ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 500 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి.6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ , లెవల్ 2 ADAS వంటి ఫీచర్లను ఇందులో అందించవచ్చు.

Kia Clavis EV

ఇటీవల విడుదల చేసిన కొత్త క్లావిస్‌ను ఇప్పుడు ఈవీ వెర్షన్‌లో విడుదల చేయవచ్చు. డిజైన్ పరంగా కొత్త క్లావిస్ అత్యంత చెత్త కారు. దాని ఈవీ వెర్షన్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో చూడాలి. క్రెటా బ్యాటరీ ప్యాక్‌ను దీనిలో ఇన్‌స్టాల్ చేయవచ్చని చెబుతున్నారరు. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

Mahindra XUV 3X0 EV

మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 3X0 ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. దీనిలో 34.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది, ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 456 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కానీ ఈ కారు డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండవు. ఎంట్రీ లెవల్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.

Tata Sierra EV

టాటా సియెర్రా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కావచ్చు. కొత్త సియెర్రా భారతదేశంలో ఈవీ, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వస్తుంది. ఇది టాటా Gen2 ఈవీ ప్లాట్‌ఫామ్‌పై మానుఫ్యాక్చురింగ్ చేస్తున్నారు. భద్రత కోసం, కొత్త సియెర్రాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC),లెవల్ 2 ADAS వంటి ఫీచర్లను అందించచ్చు. దీనిలో అమర్చిన బ్యాటరీ 500 కిలోమీటర్ల పరధిని అందిస్తుంది.

Maruti Suzuki e Vitara

మారుతి సుజుకి ఈ సంవత్సరం భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'విటారా'ను రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో విడుదల చేయవచ్చు. 49కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇ విటారా గుజరాత్ ప్లాంట్‌లో తయారవుతుంది, భద్రత కోసం, ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాలు, లెవల్-2 ADAS, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటాయి. భారతదేశంలో దీని ధర దాదాపు రూ. 17 నుండి 18 లక్షల వరకు ఉండవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories