TVS Jupiter CNG: మార్కెట్లోకి మరో CNG స్కూటర్‌.. ఏకంగా 226 కిమీ మైలేజ్

TVS Jupiter CNG
x

TVS Jupiter CNG: మార్కెట్లోకి మరో CNG స్కూటర్‌.. ఏకంగా 226 కిమీ మైలేజ్

Highlights

TVS Jupiter CNG: టీవీఎస్ మోటార్ కంపెనీ తన జూపిటర్ CNG స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది.

TVS Jupiter CNG: టీవీఎస్ మోటార్ కంపెనీ తన జూపిటర్ CNG స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే మొదటి CNG స్కూటర్. ఈ స్కూటర్ ప్రస్తుతం ఎక్స్‌పోలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బజాజ్ ఫ్రీడమ్ బైక్ ఇప్పటికే CNG మోటార్ సైకిల్ సెగ్మెంట్లో విడుదలైంది. దీని తర్వాత స్కూటర్ సెగ్మెంట్లోకి జూపిటర్ ఎంట్రీ ఇచ్చింది.

టీవీఎస్ జూపిటర్ CNG ట్యాంక్ 1.4 కిలోల ఫిల్లింగ్ కెపాసిటీతో రూపొందించారు. ఈ ట్యాంక్ సాధారణ జూపిటర్ 125లో కనిపించే అండర్ సీట్ బూట్ లొకేషన్‌లో ఉంటుంది. ట్యాంక్‌ను ప్లాస్టిక్ ప్యానెల్‌తో కవర్ చేశారు. CNG ప్రెజర్ గేజ్‌ని చూడటానికి ఐలెట్ చుట్టూ ఫిల్లర్ నాజిల్ ఉంటుంది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. జూపిటర్ సిఎన్‌జి ఒక కిలో సిఎన్‌జిపై 84 కిమీ మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. CNG ట్యాంక్‌తో పాటు, 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. రెండు ట్యాంక్‌లను ఫుల్ చేస్తే 226 కిమీ మైలేజీని పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఇంజన్ విషయానికి వస్తే ఇది OBD2B ప్రమాణాలకు అనుగుణంగా 124.8cc ఇంజన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజన్ 5.3Kw పవర్, 9.4Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రాబోయే ఈ కొత్త TVS జూపిటర్ CNG స్కూటర్ గరిష్టంగా 84 kmph వేగాన్ని అందుకోగలదు.

కాకపోతే జూపిటర్ CNG మోడల్ పెట్రోల్ పవర్డ్ జూపిటర్ 125 స్కూటర్‌తో సమానంగా ఉంటుంది. డిజైన్, ఫీచర్లు, వీల్స్ లేదా బ్రేక్‌లు ఏదైనా కావచ్చు, ప్రతిదీ ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. జూపిటర్ 125 CNG ఇప్పటికీ కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఇది భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories