Best Selling Electric Scooter: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్..దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ ఇదే..!

Best Selling Electric Scooter
x

Best Selling Electric Scooter: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్..దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ ఇదే..!

Highlights

Best Selling Electric Scooter: దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి.

Best Selling Electric Scooter: దేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త మోడళ్ల రాకతో వినియోగదారులకు ఆప్షన్లకు కొదవలేదు. కానీ ఇప్పటికీ బజాజ్, టీవీటీఎస్, ఓలా వంటి కంపెనీలు స్కూటర్లు ఎక్కువగా విక్రయిస్తూ అగ్రస్థానంలో ఉన్నాయి. మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనాలని చూస్తున్నట్లయితే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

టీవీఎస్ ఐక్యూబ్ గత నెలలో 24,991 యూనిట్లను విక్రయించింది, అయితే 2024 సంవత్సరం ఇదే సమయంలో ఈ సంఖ్య 15,652 యూనిట్లు, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కంపెనీ 9,339 యూనిట్లు అధికంగా విక్రయించింది. మార్కెట్లో నంబర్ వన్‌గా నిలిచింది. ఈసారి Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గత నెలలో 24,336 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది కంపెనీ ఈ స్కూటర్‌ను 32,424 యూనిట్లను విక్రయించింది.

ఈసారి Ola 8088 యూనిట్లను తక్కువగా విక్రయించింది. YOY విక్రయాలలో 25శాతం నష్టాన్ని చవిచూసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఓలా రెండోది. ఈసారి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మూడవ స్థానంలో నిలిచింది. గత నెలలో ఈ స్కూటర్ 21,045 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 14,114 యూనిట్లుగా ఉంది. ఈసారి కంపెనీ 49శాతం వృద్ధితో 6,901 యూనిట్లను విక్రయించింది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 95 వేల నుండి మొదలవుతుంది. వివిధ బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. స్కూటర్లో 2.2కిలోవాట్ నుండి 5.1కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మీ అవసరాన్ని బట్టి మోడల్‌ను ఎంచుకోవచ్చు.

ఈ స్కూటర్ 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఐక్యూబ్‌లో 12 అంగుళాల టైర్ ఉంది. రైడర్ భద్రత కోసం, స్కూటర్ ముందు టైర్‌పై డిస్క్ బ్రేక్‌లు, వెనుక టైర్‌పై డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. టీవీఎస్ ఈ స్కూటర్‌లో 770 మిమీ సీట్ హైట్‌ను ఇచ్చింది, తద్వారా తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా సులభంగా రైడ్ చేయచ్చు. స్కూటర్ 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో మీరు హెల్మెట్, ల్యాప్‌టాప్, మీ ఇతర వస్తువులను సులభంగా ఉంచొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories