Toyota: SUV మార్కెట్‌లో కొత్త సంచలనం.. టయోటా హైరైడర్ అమ్మకాలు రెట్టింపు

Toyota: SUV మార్కెట్‌లో కొత్త సంచలనం.. టయోటా హైరైడర్ అమ్మకాలు రెట్టింపు
x
Highlights

Toyota: భారతీయ కార్ల మార్కెట్‌లో 2025లో ఎస్‌యూవీల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వినియోగదారుల మారుతున్న అభిరుచులు ఈ సెగ్మెంట్ ను కొత్త శిఖరాలకు చేర్చాయి. ఈ విభాగంలో చాలా వాహనాలు ప్రజాదరణ పొందాయి.

Toyota: భారతీయ కార్ల మార్కెట్‌లో 2025లో ఎస్‌యూవీల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వినియోగదారుల మారుతున్న అభిరుచులు ఈ సెగ్మెంట్ ను కొత్త శిఖరాలకు చేర్చాయి. ఈ విభాగంలో చాలా వాహనాలు ప్రజాదరణ పొందాయి. అయితే ఒక కారు మాత్రం చాలా కాలం తర్వాత టాప్ 10 అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలో చేరింది. అదే టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.

టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌ను మొదటిసారిగా 2022లో ప్రారంభించారు. ఇది అర్బన్ క్రూజర్ అప్‌డేటెడ్, హైబ్రిడ్ మోడల్. హైరైడర్ భారత మార్కెట్‌లో ఒక ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీగా నిలిచింది, ఇది స్టైల్, టెక్నాలజీ మైలేజ్ అద్భుతమైన కలయిక. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎక్స్-షోరూమ్ ధర బేస్ మోడల్ కోసం రూ.11.34 లక్షల నుండి ప్రారంభమై, టాప్-ఎండ్ మోడల్ కోసం రూ.20.19 లక్షల వరకు ఉంటుంది.

హైరైడర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. ఇందులో క్రిస్టల్ యాక్రిలిక్ గ్రిల్, ట్విన్ ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి దీనికి పవర్ ఫుల్ ఎస్‌యూవీ లుక్ ఇస్తాయి. పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ బాడీ కలర్ ఆప్షన్‌లు దీనికి మరింత ప్రీమియం లుక్‌ని అందిస్తాయి. టయోటా బ్రాండ్ కావడం వల్ల, చాలా మంది దీనిని ఫార్చ్యూనర్ కు చౌకైన ప్రత్యామ్నాయంగా కూడా భావిస్తున్నారు.

ఈ ఎస్‌యూవీ లోపలి భాగం డ్యూయల్-టోన్ బ్లాక్, బ్రౌన్ థీమ్‌లో ఉంటుంది. ఇది ఒక ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. టయోటా ఐ-కనెక్ట్ ద్వారా రిమోట్ ఏసీ కంట్రోల్, వెహికల్ ట్రాకింగ్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ వంటి 55 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

హైరైడర్ రెండు పవర్‌ట్రైన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీ. స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి మొత్తం 114 బిహెచ్‌పి పవర్ లభిస్తుంది. ఇది ఈ-సీవీటీ (e-CVT) ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్‌లో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది, ఇది కష్టమైన ప్రదేశాలలో కూడా మెరుగైన ట్రాక్షన్‌ను అందిస్తుంది.

హైరైడర్ ప్రధాన లక్షణాలలో ఒకటి దాని మైలేజ్. స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్ 27.97 కి.మీ/లీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది, ఇది దాని విభాగంలో అత్యంత ఫ్యూయెల్ కెపాసిటీ గల వాహనంగా నిలుస్తుంది. భద్రత విషయానికి వస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (ABS) తో పాటు ఈబీడీ (EBD), వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), హిల్ హోల్డ్ , హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. 360-డిగ్రీ కెమెరా, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రయాణికుల భద్రతను మరింత పెంచుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories