Toyota Urban Cruiser Taisor: ధరల దడ.. అమాంతం పెరిగిన టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ రేటు..!

Toyota Urban Cruiser Taisor
x

Toyota Urban Cruiser Taisor: ధరల దడ.. అమాంతం పెరిగిన టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ రేటు..!

Highlights

Toyota Urban Cruiser Taisor: టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఒక ఫేమస్ ఎస్‌యూవీ. ఈ కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్ రీ-బ్యాడ్జ్ మోడల్ మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది.

Toyota Urban Cruiser Taisor: టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఒక ఫేమస్ ఎస్‌యూవీ. ఈ కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్ రీ-బ్యాడ్జ్ మోడల్ మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. ప్రస్తుతం, కంపెనీ కొత్త టైజర్ ఎస్‌యూవీ ధరలో మార్పులు చేసింది. ఎస్‌యూవీ ధర రూ.5,500 పెరిగింది. ఈ ధర S AMT, S Plus AMT వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా అన్ని వేరియంట్ల ధర రూ.500 పెరిగింది. దీనితో పాటు కొత్త కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.74 లక్షల నుండి రూ.13.04 లక్షలు.

ఈ కారు E, S, S Plusతో సహా పలు రకాల వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది. లూసెంట్ ఆరెంజ్, కేఫ్ వైట్, సిల్వర్, గేమింగ్ గ్రే, స్పోర్టీ రెడ్ కలర్స్‌ ఉన్నాయి. కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఎస్‌యూవీలో 5 సీట్లు చూడొచ్చు. వీకెండ్, హాలిడే ట్రిప్‌లకు వెళ్లినప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లేందుకు 308 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది.

ఈ కొత్త కారులో 1.2-లీటర్ నాచురల్ ఆశ్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్, సిఎన్‌జి ఇంజన్ ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఉంది. లీటర్‌పై 19.8 నుండి 28.5 kmpl మైలేజీని అందిస్తుంది.

ఈ అర్బన్ క్రూయిజర్ టైజర్ ఎస్‌యూవీలో అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రేర్ ఏసీ వెంట్‌లు, ప్యాడిల్ షిఫ్టర్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.

భద్రత విషయానికి వస్తే, ప్రయాణీకుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్,యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories