Toyota Glanza: చౌక కారు.. రూ.9,000 పెరిగిన రేటు.. కొనేవారికి షాక్..!

Toyota Glanza: చౌక కారు.. రూ.9,000 పెరిగిన రేటు.. కొనేవారికి షాక్..!
x

Toyota Glanza: చౌక కారు.. రూ.9,000 పెరిగిన రేటు.. కొనేవారికి షాక్..!

Highlights

Toyota Glanza: ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఏడాది జనవరిలో కార్ల ధరలు పెంచగా, ఆ తర్వాత మరోసారి ఈ నెల ఫిబ్రవరిలో కూడా కార్ల ధరలు పెంచుతున్నారు. ఇన్‌పుట్‌ ​​ధర పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు.

Toyota Glanza: ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఏడాది జనవరిలో కార్ల ధరలు పెంచగా, ఆ తర్వాత మరోసారి ఈ నెల ఫిబ్రవరిలో కూడా కార్ల ధరలు పెంచుతున్నారు. ఇన్‌పుట్‌ ​​ధర పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ నెలలో, టయోటా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు గ్లాంజా ధరలను కూడా పెంచింది. టయోటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ధర ఇప్పుడు రూ. 9,000 పెరిగింది. ఈ ధర పెరుగుదల ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ S, G వేరియంట్‌లపై వర్తిస్తుంది, ఇతర వేరియంట్‌లపై రూ. 4,000 పెరుగుదలను చూసాయి, మరోవైపు టయోటా గ్లాంజా టాప్-స్పెక్ V AMT వేరియంట్ ధర అలాగే ఉంది.

Toyota Glanza Features

టయోటా గ్లాంజా ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. గ్లాంజా కంపెనీమొట్టమొదటి రీబ్యాడ్జ్ మోడల్. ఈ కారును మారుతి సుజుకి బాలెనో ఆధారంగా రూపొందించారు. గ్లాంజా హ్యుందాయ్ ఐ20కి గట్టి పోటీనిస్తుంది. దీని డిజైన్ సరిగ్గా బాలెనో మాదిరిగానే ఉంటుంది. ఈ కారు మస్కులర్ బానెట్, క్రోమ్ అవుట్‌లైన్‌తో బ్లాక్-అవుట్ గ్రిల్, విశాలమైన ఎయిర్ డ్యామ్, పవర్ యాంటెన్నా,రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌తో వస్తుంది. ఫుల్ LED లైటింగ్ సెటప్‌తో కారులో కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లు, స్లాట్డ్ గ్రిల్ ప్యాటర్న్ కనిపిస్తాయి.

Toyota Glanza Price

టయోటా గ్లాంజా‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఇందులో CNG కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 76హెచ్‌పి పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలానే 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ కవరేజ్, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా ఫీచర్లు అందించారు. గ్లాంజా ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.90 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories