Toyota: టయోటా ఫార్చ్యూనర్ అద్భుతం.. భారత్‌లో 3 లక్షల యూనిట్ల సేల్స్ రికార్డు!

Toyota: టయోటా ఫార్చ్యూనర్ అద్భుతం.. భారత్‌లో 3 లక్షల యూనిట్ల సేల్స్ రికార్డు!
x
Highlights

Toyota: భారత మార్కెట్‌లో కొన్ని వాహనాలు కేవలం రవాణా సాధనాలుగా కాకుండా ఒక నమ్మకంగా నిలుస్తాయి.

Toyota: భారత మార్కెట్‌లో కొన్ని వాహనాలు కేవలం రవాణా సాధనాలుగా కాకుండా ఒక నమ్మకంగా నిలుస్తాయి. అలాంటి వాహనాల్లో టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) ఒకటి. దీన్ని కేవలం ఒక ఎస్‌యూవీ (SUV) అనడం కంటే, రోడ్డుపై నడిచే ఒక 'తోపు' అని చెప్పడం సబబే. 2009లో భారత్‌లో విడుదలైనప్పటి నుండి ఈ పవర్ ఫుల్ ఎస్‌యూవీ ఇప్పుడు ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు ఏకంగా 3 లక్షల యూనిట్లకు పైగా ఫార్చ్యూనర్‌లు అమ్ముడయ్యాయి.

ఫార్చ్యూనర్ ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి టయోటా "QDR" ఫిలాసఫీ ప్రధాన కారణం. QDR అంటే క్వాలిటీ (నాణ్యత), డ్యూరబిలిటీ (మన్నిక), రిలయబిలిటీ (నమ్మకత్వం). టయోటా కిర్లోస్కార్ మోటార్ వైస్ ప్రెసిడెంట్ వరిందర్ వాధ్వా ప్రకారం.. ఈ మూడు సూత్రాల వల్లే ఫార్చ్యూనర్ వంటి వాహనాలు ఎక్కువ కాలం మన్నుతాయి. వాటికి అద్భుతమైన రీసేల్ విలువ కూడా లభిస్తుంది.

ఇటీవలే టయోటా కంపెనీ ఫార్చ్యూనర్ లెజెండర్ (Fortuner Legender) లో కొత్త 4X4 మాన్యువల్ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.46.36 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త వేరియంట్ ఫార్చ్యూనర్ 4X4 ఆటోమేటిక్ (AT), జిఆర్-ఎస్ (GR-S) మోడల్స్ మధ్య స్థానంలో ఉంది. లెజెండర్ సిరీస్‌లో 4X4 డ్రైవ్‌ట్రైన్ సౌకర్యం రావడం ఇదే మొదటిసారి. ఇది వాహన ప్రియులను మరింత ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

ఫార్చ్యూనర్‌లో రెండు రకాల ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

* 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్: ఇది 201 bhp పవర్, 420 నుండి 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా పవర్ ఫుల్ ఇంజిన్, ఆఫ్-రోడింగ్‌కు కూడా అనుకూలం.

* 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్: ఇది 164 bhp పవర్, 245 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజిన్ ఎంపికలలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఫార్చ్యూనర్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జేబీఎల్ (JBL) 11-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లవ్‌బాక్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు జియో-ఫెన్సింగ్, రియల్-టైమ్ ట్రాకింగ్, ఆన్‌లైన్ సర్వీస్ బుకింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా అందించబడ్డాయి. ఈ ఫీచర్లు వాహనంలో కూర్చున్న వారికి లగ్జరీ ఫీలింగ్ కలుగుతుంది.

ఫార్చ్యూనర్ ధర రూ.33.78 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై రూ.51.94 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. నేడు ఫార్చ్యూనర్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది ఒక స్టేటస్ సింబల్ (గుర్తింపు చిహ్నం)గా మారింది. దాని పటిష్టమైన నిర్మాణం, అద్భుతమైన పనితీరు, రోడ్డుపై దాని ఉనికి భారతీయ రోడ్లకు దానిని ఒక 'రాయల్ ఎస్‌యూవీ'గా మార్చేశాయి. ఈ కొత్త రికార్డుతో ఫార్చ్యూనర్ భారత్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories