Top 3 Selling Scooters: జనాలు ఎక్కువ కొంటున్న స్కూటర్లు ఇవే.. మెరుగైన మైలేజ్.. ఎక్కువ రీసేల్..!

Top 3 Selling Scooters
x

Top 3 Selling Scooters: జనాలు ఎక్కువ కొంటున్న స్కూటర్లు ఇవే.. మెరుగైన మైలేజ్.. ఎక్కువ రీసేల్..!

Highlights

Top 3 Selling Scooters: దేశంలో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఫ్యామిలీ క్లాస్‌తో పాటు యువత కూడా ఇప్పుడు బైక్‌ల కంటే స్కూటర్లను నడపడానికి ఇష్టపడుతున్నారు. కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి.

Top 3 Selling Scooters: దేశంలో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఫ్యామిలీ క్లాస్‌తో పాటు యువత కూడా ఇప్పుడు బైక్‌ల కంటే స్కూటర్లను నడపడానికి ఇష్టపడుతున్నారు. కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. దీని కారణంగా ప్రజలకు మరిన్ని ఎంపికలు ఉన్నాయి. విక్రయాల నివేదికల ఆధారంగా గత నెల ఫిబ్రవరి 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 3 స్కూటర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

3. Suzuki Access

సుజుకి యాక్సెస్ 125 టాప్ 3 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌ల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. గత నెలలో ఈ స్కూటర్ 59,039 యూనిట్లు విక్రయించగా, గత సంవత్సరం ఇదే నెలలో ఈ సంఖ్య 56,473 యూనిట్లుగా ఉంది. ఇంజన్ విషయానికి వస్తే కొత్త సుజుకి యాక్సెస్ 125లో 124సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8.4బిహెచ్‌పి పవర్,10.2ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. కంపెనీ ఇప్పటికే స్కూటర్ ఇంజన్‌ను మెరుగుపరిచింది, ఇది పనితీరుతో పాటు ఇంధనాన్ని ఆదా చేస్తుంది. యాక్సెస్ 125 ధర రూ. 81,700 నుండి ప్రారంభమవుతుంది.

2. TVS Jupiter

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ రెండో స్థానంలో ఉంది. ఈ స్కూటర్ ఇప్పుడు హోండా యాక్టివాకు గట్టి పోటీనిస్తోంది. గత నెలలో 1,03,576 యూనిట్లు జూపిటర్ అమ్ముడయ్యాయి. గత ఏడాది జుపిటర్ 73,860 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈసారి కంపెనీ ఈ స్కూటర్ 29,716 యూనిట్లను విక్రయించింది. ఇంజన్ విషయానికి వస్తే ఇప్పుడు జూపిటర్ 110 స్కూటర్‌లో కొత్త ఇంజన్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ స్కూటర్‌లో 113.3 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తుంది, 5.9కిలోవాట్ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో సివిటి గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 82 కిమీ. జూపిటర్ 110 ఎక్స్-షోరూమ్ ధర రూ.73,700.

1. Honda Activa

ఎప్పటిలాగే ఈసారి కూడా 1,74,009 యూనిట్ల హోండా యాక్టివా విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 2,00,134 యూనిట్ల యాక్టివా స్కూటర్లను విక్రయించింది. ఈసారి ఈ స్కూటర్ 26,125 తక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇంజన్ విషయానికి వస్తే యాక్టివా 110cc OBD2B కంప్లైంట్ ఇంజన్‌‌తో వస్తుంది. ఈ ఇంజన్ 5.88 kW పవర్, 9.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు, స్కూటర్‌కు ఇడ్లింగ్ స్టాప్ సిస్టమ్ అందించారు. హోండా ఈ ఇంజన్ ఇప్పటికే దాని బలమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. హోండా యాక్టివా ఎక్స్-షోరూమ్ ధర రూ.80,950 నుండి ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories