Top 10 Best Selling Smartphones Of 2025: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు.. ఈ మోడల్ అగ్రస్థానంలో..!


Top 10 Best Selling Smartphones Of 2025: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు.. ఈ మోడల్ అగ్రస్థానంలో..!
Top 10 Best Selling Smartphones Of 2025: టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో యాపిల్ ఐఫోన్ 16 అగ్రస్థానంలో ఉంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ 2025 మొదటి త్రైమాసికానికి సంబంధించిన డేటాను విడుదల చేసింది.
Top 10 Best Selling Smartphones Of 2025: టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో యాపిల్ ఐఫోన్ 16 అగ్రస్థానంలో ఉంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ 2025 మొదటి త్రైమాసికానికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలో ఐఫోన్ 16 అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. దాని తర్వాత ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రెండవ స్థానంలో, ఐఫోన్ 16 ప్రో మూడవ స్థానంలో ఉన్నాయి. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఫోన్లలో 4 శాంసంగ్ ఫోన్లు. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను చూడండి.
1. Apple iPhone 16
2025 మొదటి త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్ 16 మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఫోన్‌ని సెప్టెంబర్ 2024లో ప్రారంభించారు. ఇందులో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే (120Hz), A18 బయోనిక్ చిప్, ఐఫోన్ ఆఫరేషన్ సిస్టమ్ 18 ఉంది. కెమెరా సెటప్‌లో 48MP ప్రైమరీ (ఫ్యూజన్ కెమెరా) + 12MP అల్ట్రా-వైడ్, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది 3561mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్ ఉంది. ఇతర ఫీచర్స్‌లో 5జీ, వైఫై 7, యాపిల్ ఇంటెలిజెన్స్ (ఉన్నాయి. ప్రారంభ ధర దాదాపు రూ. 67,000.
2. Apple iPhone 16 Pro Max
రెండవ స్థానంలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఉంది, ఇది సెప్టెంబర్ 2024లో లాంచ్ అయింది. దీనికి 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే (120Hz, 2000 నిట్స్), A18 ప్రో చిప్ , iOS 18 ఉన్నాయి. కెమెరాలో 48MP ప్రైమరీ + 48MP అల్ట్రా-వైడ్ + 12MP టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్), 12MP ఫ్రంట్ ఉన్నాయి. ఇది 4685mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్, IP68 రేటింగ్ కలిగి ఉంది. 5G, సిరామిక్ షీల్డ్, యాక్షన్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రారంభ ధర దాదాపు రూ.1,00,000.
3. Apple iPhone 16 Pro
మూడవ స్థానంలో ఐఫోన్ 16 ప్రో ఉంది, ఇది సెప్టెంబర్ 2024లో లాంచ్ అయింది. ఇందులో 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే (120Hz, 2000 నిట్స్), A18 ప్రో చిప్, iOS 18 కలిగి ఉంది. కెమెరా సెటప్ 48MP ప్రైమరీ + 48MP అల్ట్రా-వైడ్ + 12MP టెలిఫోటో (5x జూమ్), 12MP ఫ్రంట్. దీనిలో 3550mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్, IP68 రేటింగ్ ఉంది. ఇతర ఫీచర్స్‌లో 5జీ, యాపిల్ ఇంటెలిజెన్స్, టైటానియం ఫ్రేమ్ ఉన్నాయి. ప్రారంభ ధర $999 (సుమారు రూ.84,000).
4. Apple iPhone 15
నాల్గవ స్థానంలో ఐఫోన్ 15 ఉంది. ఇది సెప్టెంబర్ 2023లో లాంచ్ అవుతుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే (60Hz), A16 బయోనిక్ చిప్, iOS 17 (అప్‌గ్రేడబుల్) ఉంది. ఈ కెమెరా 48MP ప్రైమరీ + 12MP అల్ట్రా-వైడ్, 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీనిలో 3349mAh బ్యాటరీ, 20W ఛార్జింగ్, IP68 రేటింగ్ ఉంది. 5G, డైనమిక్ ఐలాండ్,USB-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రారంభ ధర దాదాపు రూ.66,000.
5. Samsung Galaxy A16
ఐదవ స్థానంలో డిసెంబర్ 2024లో ప్రారంభించిన సామ్‌సంగ్ గెలాక్సీ A16 ఉంది. దీనిలో 6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే (90Hz), ఎక్సినోస్ 1330 చిప్, ఆండ్రాయిడ్ 14 (One UI 6) ఉంది. కెమెరాలో 50MP ప్రైమరీ + 5MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో, 13MP ఫ్రంట్ ఉన్నాయి. అలానే 5000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్, IP54 రేటింగ్ ఉంది. ఫీచర్లలో 5G, 6 సంవత్సరాల OS అప్‌డేట్‌లు , సైడ్ ఫింగర్‌ప్రింట్ ఉన్నాయి. ప్రారంభ ధర రూ.18,999.
6. Apple iPhone 16e
ఆరవ స్థానంలో ఐఫోన్ 16e ఉంది. దీనిని ఫిబ్రవరి 2025లో ప్రారంభించారు. ఫోన్ 4.7-అంగుళాల రెటినా హెచ్‌డి డిస్‌ప్లే (60Hz), A18 చిప్, iOS 18 ఉంది. ఫోటోగ్రఫీ కోసం 12MP ప్రైమరీ, 7MP ఫ్రంట్ కెమెరా అందించారు. దీనిలో 1821mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్, IP67 రేటింగ్ ఉంది. 5G, ఆపిల్ ఇంటెలిజెన్స్, కాంపాక్ట్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రారంభ ధర $549 సుమారు రూ.46,000.
7. Samsung Galaxy S25 Ultra
ఏడవ స్థానంలో జనవరి 2025లో విడుదల చేసిన సామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఉంది. 6.8-అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే , స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్, ఆండ్రాయిడ్ 15 ఉన్నాయి. ఈ కెమెరాలో 200MP ప్రైమరీ + 50MP అల్ట్రా-వైడ్ + 10MP టెలిఫోటో (3x) + 10MP పెరిస్కోప్ (5x), 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలానే 5000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, IP68 రేటింగ్ ఉంది. 5G, S పెన్ , గొరిల్లా గ్లాస్ ఆర్మర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రారంభ ధర $1299 సుమారు రూ.1,09,000.
8. Redmi 14C
ఎనిమిదవ స్థానంలో నవంబర్ 2024లో విడుదల చేసిన షియోమీ Redmi 14C ఉంది. దీనిలో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే (120Hz), మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, ఆండ్రాయిగ్ 14 (HyperOS) ఉంది. కెమెరా 50MP ప్రైమరీ + 2MP డెప్త్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5160mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్, IP52 రేటింగ్ అందించారు. ఫీచర్లలో 5G, సైడ్ ఫింగర్ ప్రింట్, 3.5మి.మీ జాక్ ఉన్నాయి. ప్రారంభ ధర సుమారు రూ.9999.
9. Apple iPhone 15 Pro Max
తొమ్మిదవ స్థానంలో ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఉంది, ఇది సెప్టెంబర్ 2023లో లాంచ్ అవుతుంది. దీనిలో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే (120Hz), A17 ప్రో చిప్, iOS 17 (అప్‌గ్రేడబుల్) ఉంది. ఈ కెమెరాలో 48MP ప్రైమరీ + 12MP అల్ట్రా-వైడ్ + 12MP టెలిఫోటో (5x), 12MP ఫ్రంట్ ఉన్నాయి. ఇది 4441mAh బ్యాటరీ, 20W ఛార్జింగ్, IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. 5G, యాక్షన్ బటన్, టైటానియం ఫ్రేమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రారంభ ధర దాదాపు రూ.99,000.
10. Apple iPhone 16 Plus
పదో స్థానంలో ఐఫోన్ 16 ప్లస్ ఉంది, ఇది సెప్టెంబర్ 2024లో లాంచ్ అవుతుంది. దీనిలో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే (120Hz), A18 చిప్, iOS 18 ఉన్నాయి. 48MP ప్రైమరీ + 12MP అల్ట్రా-వైడ్,12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలానే 4383mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ , IP68 రేటింగ్ ఉంది. 5G, ఆపిల్ ఇంటెలిజెన్స్, డైనమిక్ ఐలాండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రారంభ ధర $899 సుమారు రూ.75,000.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



