Best Electric Scooters: ఇవి అత్యుత్తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ..!

These Are The Best Electric Scooters The Demand Is High In The Market
x

Best Electric Scooters: ఇవి అత్యుత్తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ..!

Highlights

Best Electric Scooters:ఇంధన ధరలు పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ధర తక్కువ, మైలేజీ ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ ఏర్పడుతోంది.

Best Electric Scooters: ఇంధన ధరలు పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ధర తక్కువ, మైలేజీ ఎక్కువగా ఉండటంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్‌ ఏర్పడుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలంటే 5 బెస్ట్ ఆప్షన్‌లు ఉన్నాయి. వీటిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ఇది కాకుండా TVS, Ather ఎనర్జీ, సింపుల్ ఎనర్జీ, బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు బలమైన బ్యాటరీని కలిగి ఉంటాయి. రహదారిపై అధిక వేగంతో నడిచే శక్తిని కలిగి ఉంటాయి. భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

Ola S1 pro

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాలలో Ola S1 pro మొదటి స్థానంలో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.లక్షా 40 వేలు. Ola S1 Pro ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

TVS iQube

TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.లక్షా 25 వేల నుంచి రూ.లక్షా 61 వేల వరకు ఉంటుంది. TVS iQube ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు నడవగలదు.

Aether 450X

Aether 450X ఎక్స్-షోరూమ్ ధర రూ.1 లక్షా 28 వేల నుంచి రూ.1 లక్షా 49 వేల వరకు ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.

Bajaj Chetak

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర కూడా రూ.లక్షా 22 వేల నుంచి రూ. లక్షా 43 వేల వరకు ఉంటుంది. బజాజ్ చేతక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 90 కిలోమీటర్లు నడుస్తుంది.

Simple one

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. సింపుల్ వన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. లక్షా 45 వేల నుంచి రూ. లక్షా 50 వేల వరకు ఉంటుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories