Best Electric Bikes With High Range: ఇవి మామూలు బండ్లు కాదండోయ్.. మైలేజ్, ఫీచర్స్, పవర్‌తో ఆశ్చర్యపరుస్తాయి..!

Best Electric Bikes With High Range
x

Best Electric Bikes With High Range: ఇవి మామూలు బండ్లు కాదండోయ్.. మైలేజ్, ఫీచర్స్, పవర్‌తో ఆశ్చర్యపరుస్తాయి..!

Highlights

Best Electric Bikes With High Range: భారత్‌లో టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కి విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ కంపెనీలతో పాటు కొత్త కొత్త సంస్థలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తున్నాయి.

Best Electric Bikes With High Range: భారత్‌లో టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కి విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ కంపెనీలతో పాటు కొత్త కొత్త సంస్థలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తున్నాయి. దీంతో కస్టమర్లకు చాలా మంచి ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలని చూస్తున్నట్లుయితే స్టైల్‌తో పాటు డిజైన్, లాంగ్ రేంజ్ అందించే ఉత్తమ బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.

Ola Roadster X Plus

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ మంచి ఎంపిక. ఈ బైక్‌లో రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి, ఇందులో 4.5 కిలోవాట్, 9.1 కిలోవాట్ బ్యాటరీలు అందించారు, దీనిలోని చిన్న బ్యాటరీ ఒకే ఛార్జ్‌లో 252 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే పెద్ద బ్యాటరీ ఒకే ఛార్జ్‌లో 501 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ ధర రూ. 84,999 ఎక్స్-షోరూమ్.

Ultraviolette F77

అల్ట్రావయోలెట్ F77 మ్యాక్ 2 మంచి బైక్. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో స్టాండర్డ్ వెర్షన్ 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది, అయితే రీకాన్ వేరియంట్‌లో 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది, దీని పరిధి వరుసగా 211 కిమీ, 323 కిమీ. ఈ బైక్ డిజైన్ చాలా స్పోర్టీగా ఉండటం దీని ప్లస్ పాయింట్. యూత్‌కి ఈ బైక్‌ నచ్చుతుంది. ఎఫ్77 మ్యాక్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.2.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది.

Raptee T 30

ఇటీవల విడుదల చేసిన రాప్టీ T 30 ఎలక్ట్రిక్ బైక్ దాని డిజైన్, రేంజ్ కారణంగా నిరంతరం వార్తల్లో ఉంది. ఇందులో 5.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది.ఈ ఇంజన్ 28.6హెచ్‌పి పవర్, 70 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.39 లక్షలు. ఈ బైక్ డిజైన్ స్పోర్టీగా ఉంది, యువత ఈ బైక్‌ను బాగా ఇష్టపడచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories