Electric Scooters: ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో స్టోరేజ్‌ ఎక్కువ.. మిగతావాటికంటే చాలా బెస్ట్‌..!

These Are The 5 Electric Scooters With More Storage They Are Much Better Than The Others
x

Electric Scooters: ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో స్టోరేజ్‌ ఎక్కువ.. మిగతావాటికంటే చాలా బెస్ట్‌..!

Highlights

Electric Scooters Storage: చాలామంది స్టోరేజ్‌ సదుపాయం ఎక్కువగా ఉంటుందని స్కూటర్లు తీసుకుంటారు.

Electric Scooters Storage: చాలామంది స్టోరేజ్‌ సదుపాయం ఎక్కువగా ఉంటుందని స్కూటర్లు తీసుకుంటారు. ఎందుకంటే లగేజి తీసుకువెళ్లడం సులువుగా ఉంటుంది. అదే బైక్‌పై అయితే ఎక్కువగా లగేజీతో ప్రయాణం చేయలేరు. అందుకే స్కూటర్ల వైపు మొగ్గు చూపుతారు. అయితే కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో స్టోరేజ్‌ సదుపాయం తక్కువగా ఉంటుందని కొందరి వాదన. కానీ ఇందులో నిజం లేదు. వాస్తవానికి స్టోరేజ్‌ సదుపాయం ఎక్కువగా ఉండే ఐదు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

River Indie

భారతదేశంలో అత్యధిక స్టోరేజ్‌ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్ ఇండీ. దీని మొత్తం అండర్ సీట్ స్టోరేజీ సామర్థ్యం 43 లీటర్లు. మీకు చాలా స్థలం లభిస్తుంది. అంతేకాకుండా మార్కెట్‌లో దీనికి బలమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా పేరుంది.

Ola S1 Pro

Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ స్టోరేజ్‌ పరంగా రెండో స్థానంలో ఉంది. Ola S1 ప్రోలో 36 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ లభిస్తుంది. రెండు హెల్మెట్‌లను సులభంగా పెట్టవచ్చు.

Ola S1 Pro Gen 2/Air

Ola S1 Pro Gen 2/Air ఎలక్ట్రిక్ స్కూటర్ స్టోరేజ్‌ పరంగా మూడో స్థానంలో ఉంది. Ola S1 Pro Gen 2, Ola S1 Air కొత్త హైబ్రిడ్ ఛాసిస్, అద్భుతమైన టెక్నాలజీ ఆధారంగా చాలా స్టోరేజ్‌ని అందిస్తున్నాయి. కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు 34 లీటర్ల స్టోరేజీని అందిస్తున్నాయి.

Simple One

సింపుల్ వన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. మీరు స్టోరేజ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. పెట్రోల్ స్కూటర్లలో ఇంత స్థలం అస్సలు ఉండదు.

Hero Vida V1

హీరో విడా శ్రేణిలోని ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి స్థలాన్ని అందిస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ 26 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీని అందిస్తున్నాయి. మీరు సీటు కింద చాలా వస్తువులను స్టోర్‌ చేయవచ్చు. హెల్మెట్‌ను కూడా పెట్టుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories