BYD: టెస్లాకు షాకిచ్చిన చైనా కంపెనీ.. సగం ధరకే కొత్త ఎలక్ట్రిక్ కారు

BYD
x

BYD: టెస్లాకు షాకిచ్చిన చైనా కంపెనీ.. సగం ధరకే కొత్త ఎలక్ట్రిక్ కారు

Highlights

BYD: ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతుంది.దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్ల కోసం మార్కెట్లో కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

BYD: ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతుంది.దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్ల కోసం మార్కెట్లో కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా టెస్లాకు గట్టి పోటీనిచ్చే చైనా కంపెనీ BYD తమ కొత్త ఎలక్ట్రిక్ కారు 'సీల్ 06'ను రిలీజ్ చేసింది. ఈ కారు ధర చాలా తక్కువగా ఉండడం, అలాగే ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలగడం దీని స్పెషాలిటీ. మరి ఈ కొత్త కారు ధర ఎంత? ఇది ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందన్న వివరాలను తెలుసుకుందాం.

టెస్లా మోడల్ 3కి గట్టి పోటీ

BYD విడుదల చేసిన ఈ కొత్త కారు టెస్లా మోడల్ 3కి నేరుగా పోటీనిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ BYD సీల్ 06 కారు సైజ్ పరంగా చూస్తే దాదాపు టెస్లా మోడల్ 3తో సమానంగా ఉంటుంది. ఈ కారు పొడవు 4720మిమి, వెడల్పు 1880మిమీ, ఎత్తు 1495మిమీ.

డ్రైవింగ్ రేంజ్, బ్యాటరీ

ఈ కారులో రెండు రకాల బ్యాటరీలను అందించారు. అందులో మొదటిది 46.08kWh బ్యాటరీ. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.రెండోది 56.64kWh బ్యాటరీ ఇది ఒకే ఛార్జ్‌తో ఏకంగా 545 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు.

సీల్ 06 ఈవీలో ప్రత్యేక ఫీచర్లు

సీల్ 06 ఈవీలో ఆధునిక ఫీచర్లు చాలా ఉన్నాయి. ADAS సిస్టమ్, రొటేటింగ్ సెంటర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,స్మాల్ డ్రైవర్ డిస్‌ప్లే స్క్రీన్ ఉంటుంది.ఇది ఎంట్రీ లెవెల్ మోడల్ అయినప్పటికీ, ఈ కారులో హీటింగ్/వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఖరీదైన కార్లలో ఉండే ఫీచర్లు ఉన్నాయి.

టెస్లా కంటే సగం తక్కువ

BYD ఈ కొత్త కారు చైనా మార్కెట్లో విడుదలైంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర 109,800 చైనీస్ యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ.13,06,789లు). మరోవైపు, చైనా మార్కెట్లో టెస్లా మోడల్ 3 RWD వెర్షన్ ధర 235,500 చైనీస్ యువాన్ల (సుమారు రూ.28,02,812లు) నుండి మొదలవుతుంది. BYD ఈ కొత్త మోడల్ ధర టెస్లా మోడల్ 3తో పోలిస్తే సగానికి సగం తక్కువగా ఉండటం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories