Tesla : ఎలన్ మాస్క్ అదిరిపోయే ఆఫర్.. పాత కారు ఇస్తే రూ.3 లక్షలు ఇస్తాడట

ఎలన్ మాస్క్ అదిరిపోయే ఆఫర్.. పాత కారు ఇస్తే రూ.3 లక్షలు ఇస్తాడట

CR Reddy
Published on: 4 Feb 2026 10:00 AM IST
Tesla : ఎలన్ మాస్క్ అదిరిపోయే ఆఫర్.. పాత కారు ఇస్తే రూ.3 లక్షలు ఇస్తాడట
X

Tesla : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో టెస్లా ఇండియా EV Switch and Save పేరుతో ఒక సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా పెట్రోల్ లేదా డీజిల్ కార్లను వాడుతున్న వారు ఎలక్ట్రిక్ కార్లకు మారేలా ప్రోత్సహించడానికి ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలలో టెస్లా మోడల్ వై కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.3 లక్షల ఎక్స్ఛేంజ్ ఇన్సెంటివ్ లభిస్తుంది. అంటే, మీరు మీ పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తే, దాని మార్కెట్ ధరతో పాటు అదనంగా మరో 3 లక్షల రూపాయల తగ్గింపు పొందే అవకాశం ఉంది.

కేవలం డిస్కౌంట్లే కాకుండా, సామాన్య, మధ్యతరగతి ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకోవడానికి టెస్లా అద్భుతమైన ఈఎమ్‌ఐ ప్లాన్లను కూడా తీసుకొచ్చింది. కేవలం రూ.6 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి, నెలకు రూ.49,000 ఈఎమ్‌ఐతో ఈ లగ్జరీ ఎస్‌యూవీని ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీనితో పాటు సుమారు రూ.50,000 విలువైన కాంప్లిమెంటరీ హోమ్ ఛార్జర్‌ను కూడా కంపెనీ ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల ఇంట్లోనే కారును ఛార్జ్ చేసుకోవడం సులభం కావడమే కాకుండా, కిలోమీటరుకు కేవలం రూపాయి ఖర్చుతో ప్రయాణించవచ్చని టెస్లా పేర్కొంది.

ఫీచర్ల విషయానికి వస్తే, టెస్లా మోడల్ వై ఒక టెక్నాలజీ అద్భుతం అని చెప్పాలి. ఇందులో 15.4 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, ప్రీమియం ఆడియో సిస్టమ్, హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 500 కి.మీ నుంచి 622 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. భారతదేశంలో టెస్లా మోడల్ వై ఎక్స్-షోరూమ్ ధర రూ.59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇంధన, నిర్వహణ ఖర్చుల పరంగా చూస్తే నెలకు దాదాపు రూ.20,000 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

టెస్లా 2025లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 225 యూనిట్లను విక్రయించింది. ఈ ఫిబ్రవరి ఆఫర్ల ద్వారా అమ్మకాలను మరింత పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 31, 2026 వరకు డెలివరీ తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయి. ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కొనాలనే ఆలోచన ఉంటే, తక్కువ ధరలో టెస్లాను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

CR Reddy

CR Reddy

Next Story