Safest Car: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. భారత్‌లో సురక్షితమైన కారు ఇదే..!

Safest Car
x

Safest Car: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. భారత్‌లో సురక్షితమైన కారు ఇదే..!

Highlights

Safest Car: దేశంలో వాహన నాణ్యతపై కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కారును కొనుగోలు చేసే ముందు భద్రతా రేటింగ్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది.

Safest Car: దేశంలో వాహన నాణ్యతపై కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కారును కొనుగోలు చేసే ముందు భద్రతా రేటింగ్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది. మీరు కూడా రూ. 10 లక్షలలోపు ఎలక్ట్రిక్ కారును కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. భారత్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్‌ల ప్రకారం 10 లక్షల బడ్జెట్ లోపు అత్యంత సురక్షితమైన కారు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది టాటా మోటార్స్ అందించే అత్యంత సురక్షితమైన ఈవీ కారు.

మీకు రన్నింగ్ ఖర్చులపై అవగాహన ఉంటే, సురక్షితమైన ఎలక్ట్రిక్ కారును రూ. 9.99 లక్షలకు టాటా పంచ్ ఈవీని బుక్ చేయచ్చు. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వయోజన ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 31.46 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49కి 45 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో పంచ్ ఈవీ మొత్తం 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సంపాదించి, 16 పాయింట్లలో 14.26 స్కోర్ చేసింది. అదనంగా టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ఎంట్రీ-లెవల్ వేరియంట్ 6-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రోల్-ఓవర్ మిటిగేషన్‌తో సహా పలు భద్రతా ఫీచర్స్‌తో వస్తుంది.

ఇతర టాప్-ఎండ్ వేరియంట్స్‌లో అదనంగా 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్‌ ఉంటుంది. కొత్త టాటా పంచ్ ఈవీ ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 14.29 లక్షలు ఎక్స్ షోరూమ్ వరక ఉంది. కొత్త టాటా పంచ్ ఈవీలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ డిస్‌ప్లేలు, ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

ఇందులో స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్‌తో సహా విభిన్న వేరియంట్స్ ఉన్నాయి. టాటా పంచ్ ఈవీలో డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ 35 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. పంచ్ మోటార్ 122 పిఎస్ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు 25 కిలోవాట్ కెపాసిటీ గల బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 265 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 82 పిఎస్ పవర్, 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories