Tata Punch : టాటా పంచ్ సరికొత్త రికార్డు.. 7 లక్షల మంది మనసు గెలుచుకున్న మినీ ఎస్‌యూవీ

Tata Punch : టాటా పంచ్ సరికొత్త రికార్డు.. 7 లక్షల మంది మనసు గెలుచుకున్న మినీ ఎస్‌యూవీ
x
Highlights

టాటా పంచ్ సరికొత్త రికార్డు.. 7 లక్షల మంది మనసు గెలుచుకున్న మినీ ఎస్‌యూవీ

Tata Punch : టాటా మోటార్స్ తన దూకుడును కొనసాగిస్తోంది. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ టాటా పంచ్ దూసుకుపోతోంది. అతి తక్కువ కాలంలోనే అత్యధిక కార్లు అమ్ముడైన మోడల్‌గా నిలిచి, ఇప్పుడు 7 లక్షల మార్కును దాటేసింది. కేవలం ఒక ఏడాది లోపే ఏకంగా 2 లక్షల కార్లు అమ్ముడయ్యాయంటే ఈ కారుకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డెలివరీలు కూడా దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. టాటా పంచ్ భారత మార్కెట్లోకి వచ్చిన నాటి నుంచి రికార్డులను తిరగరాస్తూనే ఉంది. కేవలం సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోనే కాకుండా, మొత్తం కార్ల మార్కెట్లోనే ఫాస్టెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. జనవరి 2025లో 5 లక్షల మార్కును చేరుకున్న ఈ కారు, ఆ తర్వాత కేవలం ఒకే ఏడాదిలో మరో 2 లక్షల యూనిట్లు అమ్ముడై మొత్తం 7 లక్షల మైలురాయిని అధిగమించింది. సామాన్యుడికి అందుబాటులో ఉండే ధర, అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఉండటమే దీని విజయానికి ప్రధాన కారణం.

కొత్త వెర్షన్‌లో అదిరిపోయే ఫీచర్లు: 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో టాటా మోటార్స్ భారీ మార్పులు చేసింది. ఇందులో కొత్తగా 360-డిగ్రీల కెమెరా, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ (లైటింగ్ లోగోతో) వంటి ప్రీమియం ఫీచర్లను జోడించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం సీట్లలో మెరుగైన థై సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా, ఇప్పుడు పంచ్‌లోని ప్రతీ ప్రయాణికుడికి త్రీ-పాయింట్ సీట్ బెల్ట్ సౌకర్యం లభిస్తోంది. 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది.

టర్బో పవర్, ఇంజిన్ ఆప్షన్లు: కొత్త పంచ్‌లో అతిపెద్ద అప్‌డేట్ ఏంటంటే.. నెమ్మదిగా ఉన్న పాత ఇంజిన్ స్థానంలో నెక్సాన్ నుంచి తీసుకున్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. ఇది 120 bhp పవర్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ కేవలం 11.1 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీంతో పాటు సాధారణ 1.2 లీటర్ పెట్రోల్, టాటా సొంత డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ ఉన్న సిఎన్‌జి వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు.

భద్రతలో సాటిలేదు: టాటా కార్లంటేనే సేఫ్టీకి మారుపేరు. కొత్త పంచ్‌లో ఇప్పుడు స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగులు వస్తున్నాయి. దీనికి తోడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. ధర విషయానికి వస్తే, బేస్ వేరియంట్ స్మార్ట్ రూ. 5.59 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వెర్షన్ రూ.10.54 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories