
సింగిల్ ఛార్జ్‌తో 365 కి.మీ..టాటా నుంచి మరో ఎలక్ట్రిక్ ధమాకా..ఫిబ్రవరి 20న లాంచ్
Tata Punch EV : టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా పేరుగాంచిన టాటా పంచ్ ఈవీ ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. ఫిబ్రవరి 20న లాంచ్ కానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ తాజాగా రివీల్ చేసింది. చూడగానే ఆకట్టుకునే డిజైన్, అదిరిపోయే రేంజ్‌తో ఈ కారు ఎలక్ట్రిక్ కార్ల ప్రియులను మురిపిస్తోంది.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పు దాని ముందు భాగంలో కనిపిస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది మరింత మోడ్రన్‌గా, క్లీన్‌గా ఉంది. ముందున్న బ్లాక్ ట్రిమ్స్ తొలగించి, క్లోజ్డ్ గ్రిల్ డిజైన్‌ను ఇచ్చారు. దీనివల్ల కారు మరింత ఫ్యూచరిస్టిక్ లుక్‌ను సంతరించుకుంది. కొత్తగా డిజైన్ చేసిన సన్నని LED DRLs, బంపర్‌లో కిందకు అమర్చిన హెడ్ ల్యాంప్స్ కారుకు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. టాటా హారియర్ కారులో కనిపించే సన్‌లిట్ ఎల్లో కలర్, బ్లాక్ రూఫ్ కాంబినేషన్ ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
లోపలి భాగంలో మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు కానీ, టెక్నాలజీ పరంగా టాటా భారీ అప్‌డేట్స్ ఇచ్చింది. నెక్సాన్ ఈవీలో ఉండే 12.3-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM, ప్రధానంగా లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
మెకానికల్ పరంగా పంచ్ ఈవీలో పాత ఆప్షన్లే కొనసాగుతున్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి.
స్టాండర్డ్ వెర్షన్: 25kWh బ్యాటరీతో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 265 కి.మీల రేంజ్ ఇస్తుంది. ఇది 82hp పవర్, 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
లాంగ్ రేంజ్ వెర్షన్: 35kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఏకంగా 365 కి.మీల రేంజ్ అందిస్తుంది. ఇది 120bhp పవర్, 190Nm టార్క్‌తో దూసుకెళ్తుంది.
ప్రస్తుత మోడల్ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పుల వల్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. టాప్ ఎండ్ మోడల్ రూ.15 లక్షల వరకు ఉండవచ్చు. మార్కెట్లో ఇది ఎంజీ కామెట్ ఈవీ, సిట్రోయెన్ ఇ-సి3 వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




