Bharat Mobility Global Expo 2025: దృష్టంతా ఈవీ పైనే.. ఆరు కొత్త వాహనాలను లాంచ్ చేయనున్న టాటా

Bharat Mobility Global Expo 2025: దృష్టంతా ఈవీ పైనే.. ఆరు కొత్త వాహనాలను లాంచ్ చేయనున్న టాటా
x
Highlights

Bharat Mobility Global Expo 2025: జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా మోటార్స్ అనేక కొత్త వాహనాలను పరిచయం చేయనుంది.

Bharat Mobility Global Expo 2025: జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా మోటార్స్ అనేక కొత్త వాహనాలను పరిచయం చేయనుంది. వీటిలో కంపెనీ EVలు, పెట్రోల్-డీజిల్ కార్లు కూడా ఉంటాయి. అయితే వచ్చే ఏడాది కూడా టాటా దృష్టి అంతా ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఉంటుంది. మీరు కూడా టాటా కొత్త కారు కోసం ఎదురు చూస్తున్నట్లయితే, వచ్చే నెలలో రానున్న టాటా కార్ల గురించి తెలుసుకుందాం.

టాటా సియెర్రా ఈవీ

టాటా మోటార్స్ తన అత్యంత ప్రసిద్ధ SUV సియెర్రాను తిరిగి తీసుకువస్తోంది. అయితే ఈసారి ఎలక్ట్రిక్ సియర్రా మార్కెట్లోకి విడుదల కానుంది. కంపెనీ ఈ మోడల్‌ను పెట్రోల్, డీజిల్‌లో కూడా అందించవచ్చని కూడా భావిస్తున్నారు. సియెర్రా EV 60-80 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది, ఇది 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది, అయితే ICE వెర్షన్ 170 PS , 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ని పొందవచ్చు. ఇది కాకుండా 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఇందులో చూడవచ్చు.

టాటా హారియర్ ఈవీ

కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో హారియర్ EVని కూడా ప్రదర్శిస్తుంది. ఇది ఫుల్ ఛార్జింగ్ పై 450-550 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇది డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌ని పొందుతుంది. అయితే దాని ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో ఒకే మోటారును చూడచ్చు. హారియర్ EV డిజైన్‌లో కొన్ని మార్పులు చూడచ్చు. దీనితో పాటు హారియర్ పెట్రోల్ కూడా మార్కెట్లోకి రానుంది.

టాటా సఫారి ఈవీ

టాటా మోటార్స్ కూడా హారియర్ EVని ఎక్స్‌పోలో పరిచయం చేయనుంది. అయితే దీని ప్రారంభం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఇది 7 సీట్ల ఆప్షన్‌లో రానుంది. ఇది పూర్తి ఛార్జింగ్ పై 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సఫారి EV ఇంటీరియర్ నుండి డిజైన్‌లో ప్రధాన మార్పులు చూడవచ్చు.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్

టాటా మోటార్స్ వచ్చే నెల ఎక్స్‌పో 2025లో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పరిచయం చేస్తుంది. కొత్త పంచ్ డిజైన్‌లో చాలా మార్పులు కనిపిస్తాయి. ఇది కాకుండా, కొత్త కొత్త ఫీచర్లు ఇందులో చూడొచ్చు. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఒక్క పంచ్‌తో కంపెనీ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది.

టాటా టియాగో, టిగోర్ ఫేస్‌లిఫ్ట్

టాటా మోటార్స్ టియాగో, టిగోర్ ఫేస్‌లిఫ్ట్‌లను వచ్చే నెలలో విడుదల చేయబోతోంది. ఈ సారి ఈ రెండు కార్ల డిజైన్‌పై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. కార్ల ముందు, వెనుక భాగాలలో మార్పులు కనిపిస్తాయి.ఇంజన్ గురించి మాట్లాడితే టియాగో, టిగోర్‌లలో ఒకే ఇంజన్ ఉపయోగించనున్నారు. వీటిలో 1.2L పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories