Tata Nexon CNG Dark Edition:  టాటా నెక్సాన్ నుంచి బ్లాక్ బ్యూటీ.. ఇంటీరియర్ ఎంత బాగుందో!

Tata Nexon CNG Dark Edition
x

Tata Nexon CNG Dark Edition:  టాటా నెక్సాన్ నుంచి బ్లాక్ బ్యూటీ.. ఇంటీరియర్ ఎంత బాగుందో!

Highlights

Tata Nexon CNG Dark Edition: టాటా నెక్సాన్ భారతీయ కార్ మార్కెట్‌లో ప్రముఖ ఎస్‌యూవీ కారుగా పేరు తెచ్చుకుంది.

Tata Nexon CNG Dark Edition: టాటా నెక్సాన్ భారతీయ కార్ మార్కెట్‌లో ప్రముఖ ఎస్‌యూవీ కారుగా పేరు తెచ్చుకుంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో వస్తోంది. సరసమైన ధరలో లభిస్తుండటంతో అమ్మకాల సంఖ్య కూడా భారీగానే ఉంది. కంపెనీ ఇటీవల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో 'నెక్సాన్ CNG డార్క్ ఎడిషన్' కారును ప్రదర్శించింది. సరికొత్త టాటా నెక్సాన్ CNG డార్క్ ఎడిషన్ ఎస్‌యూవీ బడ్జెట్ ధరలో విడుదలైంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.12.70 లక్షల నుండి రూ.13.69 లక్షల వరకు ఉంటుంది. ఫియర్‌లెస్ ప్లస్ పిఎస్, క్రియేటివ్ ప్లస్ పిఎస్, క్రియేటివ్ ప్లస్ ఎస్ అనే మూడు వేరియంట్స్‌లో కారు అందుబాటులోకి రానుంది.

కొత్త టాటా నెక్సాన్ సిఎన్‌జి డార్క్ ఎడిషన్ డిజైన్‌ కూడా సాధారణ నెక్సాన్ మోడల్ మాదిరిగానే ఉంది. ఈ కారులో కొన్నిరకాల మార్పులు ఉన్నాయి. డార్క్ ఎడిషన్ అనే పేరుకు తగినట్లుగానే ఎక్స్‌టీరియర్ లుక్ మొత్తం బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఇంటీరియర్‌లో ఒక్కో పార్ట్ ఒక్కో రకమైన బ్లాక్ కలర్‌లో వచ్చేలా డిజైన్ ప్లాన్ చేశారు.

ఈ ఎస్‌యూవీ కారులో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, జేబిఎల్ 8-స్పీకర్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

టాటా నెక్సాన్ సిఎన్‌జి డార్క్ ఎడిషన్ ఎస్‌యూవీ పవర్‌ఫుల్ పవర్‌ట్రెయిన్‌తో తయారుచేశారు. ఇందులోని 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్/సిఎన్‌జి ఇంజన్ 99 హార్స్ పవర్, 170 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇది 24.08 కెఎమ్‌పిఎల్ మైలేజీని అందిస్తుందని అంచనాలు చెబుతున్నాయి.

Tata Nexon EV

ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.49 లక్షల నుండి రూ. 17.19 లక్షల వరకు ఉంటుంది. రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్‌లో ఈ కారు లభిస్తోంది. అందులో ఒకటి 40.5 కిలోవాట్ (kWh) కాగో రెండోది 46.08 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ఫుల్ ఛార్జ్‌పై 390 నుండి 489 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఈ టాటా నెక్సాన్ ఈవీ కూడా 5-సీట్ల వేరియంట్‌లో వస్తుంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సహా అనేక రకాల ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణీకుల రక్షణ కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories