Tata Motors: అసలు ఏమైంది.. పడిపోతున్న టాటా మోటర్స్ అమ్మకాలు..!

Tata Motors: అసలు ఏమైంది.. పడిపోతున్న టాటా మోటర్స్ అమ్మకాలు..!
x

Tata Motors: అసలు ఏమైంది.. పడిపోతున్న టాటా మోటర్స్ అమ్మకాలు..!

Highlights

Tata Motors: టాటా మోటార్స్ ఒక విశ్వసనీయ ఆటోమొబైల్ సంస్థ. దేశీయ మార్కెట్లో, కంపెనీ ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను విక్రయిస్తోంది.

Tata Motors: టాటా మోటార్స్ ఒక విశ్వసనీయ ఆటోమొబైల్ సంస్థ. దేశీయ మార్కెట్లో, కంపెనీ ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవల టాటా ఫిబ్రవరి నెల విక్రయాల గణాంకాల నివేదికను వెల్లడించింది. అయితే అమ్మకాలు కొంతమేర తగ్గాయి. దాని గురించి మరింత సమాచారం ఇప్పుడు తెెలుసుకుందాం.

గత నెల (ఫిబ్రవరి - 2025)లో టాటా మోటార్స్ మొత్తం 79,344 యూనిట్ల (దేశీయ విక్రయాలు - విదేశీ ఎగుమతులు) వాహనాలను విక్రయించింది. 2024లో ఇదే కాలంలో విక్రయించిన 86,406 యూనిట్లతో పోల్చితే, ఇది సంవత్సరానికి స్వల్పంగా 8శాతం క్షీణతను చూసింది.

ఈ ఫిబ్రవరిలో దేశీయ విక్రయాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. టాటా మోటార్స్ 77,232 యూనిట్ల వాహనాలను మాత్రమే విక్రయించింది. ఫిబ్రవరి 2024 నెలలో విక్రయించిన 84,834 యూనిట్లతో పోల్చితే, సంవత్సరానికి (YoY) 9శాతం క్షీణత ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాలతో కూడిన ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఫిబ్రవరి నెలలో 9 శాతం క్షీణతతో 46,811 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే విధంగా, వాణిజ్య వాహనాల విభాగంలో 32,533 యూనిట్లు విక్రయించగా, 7శాతం క్షీణించాయి.

టాటా మోటార్స్ డజన్ల కొద్దీ కార్లను ప్యాసింజర్ వాహనాలుగా విజయవంతంగా విక్రయిస్తోంది. వాటిలో టియాగో, టియాగో ఈవీ, టిగుర్, టిగుర్ ఈవీ, ఆల్ట్రోజ్, పంచ్, పంచ్ ఈవీ, నెక్సాన్, నెక్సాన్ ఈవీ, కర్వ్, కర్వ్ ఈవీ, హారియర్, సఫారీ ముఖ్యమైనవి.

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే ఈ వాహనం ధర రూ.5 లక్షల నుండి రూ.8.45 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. 1.2-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, సిఎన్‌జి ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి. 19.43 నుండి 28.06 kmpl మైలేజీని అందిస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఒక ఫేమస్ ఎస్‌యూవీ. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8 నుండి 15.60 లక్షల మధ్య ఉంది. పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి ఇంజన్లు ఉంటాయి. 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.

టాటా కర్వ్ కూపే ఎస్‌యూవీ ధర రూ. 10 లక్షల నుండి రూ. 19 లక్షల వరకు ఎక్స్-షోరూమ్. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ GDI టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి . 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్స్ చూడచ్చు.

చివరగా, టాటా హారియర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 15 లక్షల నుండి రూ. 26.50 లక్షల మధ్య ఉంది. 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. 16.8 kmpl మైలేజీని అందిస్తుంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వివిధ ఫీచర్స్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories