Tata Tiago EV Offers: మధ్య తరగతికి అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కార్.. రూ.70 వేల డిస్కౌంట్

Tata Tiago EV Offers
x

మధ్య తరగతికి అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కార్.. రూ.70 వేల డిస్కౌంట్

Highlights

Tata Tiago EV Offers: మధ్య తరగతికి అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కార్ టాటా టియాగో ఈవీపై రూ.70 వేల డిస్కౌంట్ లభిస్తోంది.

Tata Tiago EV Offers: మీరు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాటి వల్ల కలిగే కాలుష్యం నుండి బయటపడాలనుకుంటున్నారా? అయితే ఎలక్ట్రిక్ కార్లను వాడటం మొదలుపెట్టండి. భారత మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా టియాగో EV మంచి ఆప్షన్. మీరు కూడా ఈ కారును కొనాలనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం. టాటా మోటార్స్ చౌకైన ఎలక్ట్రిక్ కారు టియాగో EVపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ కారు ధర, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్ తదితర వివరాలు తెలుసుకుందాం.

టాటా టియాగో EV ధరలు, ఆఫర్స్

టాటా మోటార్స్ వెబ్‌సైట్ ప్రకారం.. కంపెనీ MY24 మోడల్ టియాగో EVపై 70 వేల రూపాయల తగ్గింపును అందిస్తోంది. ఇందులో ఎక్స్‌ఛేంజ్, లాయల్టీ, క్యాష్ తగ్గింపు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి మారవచ్చు. మరింత సమాచారం కోసం మీరు టాటా షోరూమ్‌ను సంప్రదించవచ్చు.

టాటా ఇటీవలే టియాగో ఈవీ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 11.14 లక్షల మధ్య ఉంటుంది. ఈ ఈవీ కారు XE, XT, XZ ప్లస్ టెక్ లక్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

టాటా టియాగో EV బ్యాటరీ రేంజ్

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు IP67-రేటెడ్ 24 kWh, 19.2 kWh రెండు బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. దీని పెద్ద బ్యాటరీ ప్యాక్ 315 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది, అయితే 19.2 kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 250 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు.

మీరు ఈ ఎలక్ట్రిక్ కారును 15Amp హోమ్ ఛార్జర్ సహాయంతో 15 నుండి 18 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. అదే సమయంలో DC ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ కారు 57 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ స్పోర్ట్ మోడ్‌లో కేవలం 5.7 సెకన్లలో గంటకు 0-60 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

టాటా టియాగో EV సేఫ్టీ ఫీచర్స్

ఈ ఎలక్ట్రిక్ కారు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 4-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్, నాలుగు ట్వీటర్‌లతో కూడిన ఆటోమేటిక్ AC, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్యాక్ కెమెరా ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కారుపై కంపెనీ 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories