Harrier EV: సింగిల్ ఛార్జ్ తో 600కిమీ.. హారియర్ ఈవీ QWD ధరలను ప్రకటించిన టాటా..!

Tata Harrier EV Launches at Rs.28.99 Lakh Ex-Showroom  for QWD Variant
x

Harrier EV: సింగిల్ ఛార్జ్ తో 600కిమీ.. హారియర్ ఈవీ QWD ధరలను ప్రకటించిన టాటా..!

Highlights

Harrier EV: టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన హారియర్ ఈవీలోని క్వాడ్ వీల్ డ్రైవ్ (QWD) వేరియంట్ ధరలను ప్రకటించింది.

Harrier EV: టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన హారియర్ ఈవీలోని క్వాడ్ వీల్ డ్రైవ్ (QWD) వేరియంట్ ధరలను ప్రకటించింది. ఇంతకుముందు కంపెనీ హారియర్ ఈవీ రియర్ వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధరలను వెల్లడించింది. క్యూడబ్ల్యూడీ మోడల్ టాటా హారియర్ ఈవీ టాప్-ట్రిమ్ ఎంపావర్డ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. టాటా హారియర్ ఈవీ క్వాడ్ వీల్ డ్రైవ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 28.99 లక్షలుగా నిర్ణయించారు. టాటా హారియర్ ఈవీ వేరియంట్ వారీగా ధరల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హారియర్ ఈవీ వేరియంట్ల ధరలివే!

టాటా హారియర్ ఈవీ రియర్ వీల్ డ్రైవ్ (RWD) 65 kWh అడ్వెంచర్ వేరియంట్ ధర రూ.21.49 లక్షలు, టాటా హారియర్ ఈవీ అడ్వెంచర్ S 65 kWh వేరియంట్ రూ.21.99 లక్షలు. టాటా హారియర్ ఈవీ ఫియర్‌లెస్+ 65 kWh వేరియంట్ ధర రూ.23.99 లక్షలు, టాటా హారియర్ ఈవీ ఫియర్‌లెస్+ 75 kWh వేరియంట్ రూ.24.99 లక్షలు. టాటా హారియర్ ఈవీ ఎంపావర్డ్ 75 kWh వేరియంట్ ధర రూ.27.49 లక్షలు. టాటా హారియర్ ఈవీ క్వాడ్ వీల్ డ్రైవ్ (QWD) ఎంపావర్డ్ 75 kWh వేరియంట్ ధర రూ.28.99 లక్షలు

టాటా హారియర్ ఈవీ కేబిన్‌లో డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్ ఇచ్చారు, ఇందులో 14.53 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. దీని పక్కన ఒక డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది. అదనపు ఫీచర్ల విషయానికి వస్తే, టాటా హారియర్ ఈవీలో పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ అండ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 10-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వంటివి ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, టాటా హారియర్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి: 65kWh, 75kWh. టాటా హారియర్ ఈవీ 75kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 627 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. అయితే, రియల్ వరల్డ్ మైలేజ్ చూస్తే, టాటా హారియర్ ఈవీ 480 నుండి 505 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే టాటా హారియర్ ఈవీ 7.2kW AC ఛార్జర్‌తో 10.7 గంటల్లో 10% నుండి 100% వరకు ఛార్జ్ అవుతుంది. అదే 120kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే, ఎస్‌యూవీ బ్యాటరీ 25 నిమిషాల్లో 20% నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది. అంటే చాలా తక్కువ సమయంలో ఛార్జ్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories