Ventilated Seats Car: తక్కువ ధరలో ఎక్కువ కంఫర్ట్! వెంటిలేటెడ్ సీట్లు ఉన్న టాప్ కార్లు ఇవే!

Ventilated Seats Car
x

Ventilated Seats Car: తక్కువ ధరలో ఎక్కువ కంఫర్ట్! వెంటిలేటెడ్ సీట్లు ఉన్న టాప్ కార్లు ఇవే!

Highlights

Ventilated Seats Car: భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వేసవి కాలంలో ఎండలో పార్క్ చేసిన కారులోకి అడుగు పెట్టడం ఒక సాహసమనే చెప్పాలి.

Ventilated Seats Car: భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వేసవి కాలంలో ఎండలో పార్క్ చేసిన కారులోకి అడుగు పెట్టడం ఒక సాహసమనే చెప్పాలి. ముఖ్యంగా వేసవి తాపంలో కారు సీట్లలో కూర్చోవడం చాలా మందికి కష్టమైన పని. అలాంటి పరిస్థితుల్లో వెంటిలేటెడ్ సీట్లు ఎంతో అవసరమైన సౌకర్యాన్ని అందిస్తాయి. ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే ఈ ఫీచర్ ఇప్పుడు సాధారణ ప్రజల కోసం అందుబాటు ధరలో ఉన్న కార్లలో కూడా రావడం విశేషం. టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా, వోక్స్‌వ్యాగన్, ఎంజి వంటి ప్రముఖ కార్ల తయారీదారులు గత కొన్నేళ్లుగా తమ ప్యాసింజర్ వాహనాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా వెంటిలేటెడ్ సీట్లను అందిస్తున్నాయి. రూ. 20 లక్షల లోపు వెంటిలేటెడ్ సీట్లు ఉన్న నాలుగు కార్ల గురించి తెలుసుకుందాం.

టాటా ఆల్ట్రోజ్ రేసర్

వెంటిలేటెడ్ సీట్లు కలిగిన ఈ జాబితాలో టాటా ఆల్ట్రోజ్ రేసర్ మాత్రమే హ్యాచ్‌బ్యాక్. టాటా ఆల్ట్రోజ్ రేసర్ టాప్-ఎండ్ R3 వేరియంట్‌లో ఈ ఫీచర్ ఉంది. మిగిలిన ఆల్ట్రోజ్ శ్రేణి కాకుండా, ఆల్ట్రోజ్ రేసర్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. దీని ధర రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టాటా పంచ్ ఈవీ

టాటా పంచ్ ఈవీ భారతదేశంలో వెంటిలేటెడ్ సీట్లు కలిగిన చౌకైన ఎలక్ట్రిక్ కారు. అంతేకాకుండా, ఈ ఫీచర్ కలిగిన భారతదేశంలోని అత్యధికంగా అమ్ముడుపోయే SUV కూడా ఇదే. టాటా మోటార్స్ నుండి వచ్చిన ఈ చిన్న ఎలక్ట్రిక్ SUV, పంచ్ ఈవీ టాప్-ఆఫ్-ది-రేంజ్ ఎంపవర్డ్+ ట్రిమ్‌లో వెంటిలేటెడ్ సీట్లను పొందుతుంది. 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్న టాటా పంచ్ ఈవీ ఒక పూర్తి ఛార్జ్‌పై 365 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.12.84 లక్షల నుండి రూ.14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

మారుతి సుజుకి ఎక్స్‌ఎల్6

మారుతి సుజుకి ఎక్స్‌ఎల్6 అనేది వెంటిలేటెడ్ సీట్లతో సహా అనేక ప్రీమియం ఫీచర్లతో లోడ్ చేసిన ఒక ప్రీమియం MPV. రూ.13.31 లక్షల నుండి రూ.14.71 లక్షల మధ్య ధర కలిగిన (ఎక్స్-షోరూమ్) XL6 ఈ ఫీచర్ కలిగిన ఈ జాబితాలోని అత్యంత సరసమైన MPV. ఈ MPV టాప్-స్పెక్ ఆల్ఫా+ ట్రిమ్‌లో మాత్రమే ఈ ఫీచర్ ఉంది.

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా ఈ జాబితాలో వెంటిలేటెడ్ సీట్ ఫీచర్‌తో వచ్చే ఏకైక సెడాన్. రూ.14.83 లక్షల నుండి రూ.17.55 లక్షల మధ్య ధర కలిగిన (ఎక్స్-షోరూమ్) హ్యుందాయ్ వెర్నా టాప్-ఎండ్ SX(O) ట్రిమ్‌లో ఈ ఫీచర్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories