Suzuki e-Access: సుజుకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఓలా, హోండాకు గట్టి షాక్

Suzuki e-Access
x

Suzuki e-Access: సుజుకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఓలా, హోండాకు గట్టి షాక్

Highlights

Suzuki e-Access: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురాబోతోంది.

Suzuki e-Access: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురాబోతోంది. సుజుకి ఈ-యాక్సెస్ (e-Access) పేరుతో రానున్న ఈ స్కూటర్ ఉత్పత్తి ఇప్పటికే గురుగ్రామ్ లో ప్రారంభమైంది. ఇది మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత హోండా యాక్టివా ఈ, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, బజాజ్ చేతక్, ఓలా ఎస్1 వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

పవర్ ఫుల్ మోటార్, బ్యాటరీ వివరాలు

సుజుకి ఈ-యాక్సెస్ 4.1 kW కెపాసిటీ గల ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 15 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీని బ్యాటరీ ప్యాక్ 3.07 kWh కెపాసిటీతో కూడిన LFP యూనిట్.

ఛార్జింగ్ సమయం

AC పోర్టబుల్ ఛార్జర్: 25°C ఉష్ణోగ్రత వద్ద 0 నుండి 100 శాతం ఛార్జ్ కావడానికి సుమారు 6 గంటల 20 నిమిషాలు పడుతుంది. 80 శాతం ఛార్జ్ కావడానికి సుమారు 4 గంటల 30 నిమిషాలు పడుతుంది.

DC ఫాస్ట్ ఛార్జింగ్: 0 నుండి 100 శాతం ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. 80 శాతం ఛార్జ్ కావడానికి సుమారు 1 గంట 12 నిమిషాలు పడుతుంది. సుజుకి కంపెనీ ఈ-యాక్సెస్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని పేర్కొంది.

మూడు డ్రైవింగ్ మోడ్‌లు

ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడర్‌లకు 3 విభిన్న డ్రైవ్ మోడ్‌లను అందిస్తుంది

ఎకో మోడ్: ఈ మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 55 కి.మీ.లకు పరిమితం అవుతుంది. ఇది శక్తిని ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఇందులో మెరుగైన రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా పవర్ తిరిగి పొందడం ఎక్కువగా ఉంటుంది.

రైడ్ మోడ్ A: ఈ మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 71 కి.మీ.లు ఉంటుంది. ఇందులో హై రీజెనరేటివ్ బ్రేకింగ్ సెట్టింగ్ (2kW) ఉంటుంది.

రైడ్ మోడ్ B: ఈ మోడ్‌లో కూడా గరిష్ట వేగం గంటకు 71 కి.మీ.లు ఉంటుంది.

అంచనా ధర

సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో సెప్టెంబర్ 2025 లో సుమారు రూ.1,00,000 నుండి రూ.1,20,000 (ఎక్స్-షోరూమ్) ధరల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో దీనికి పోటీగా ఒడిస్సీ రేసర్, బజాజ్ చేతక్, ఒకాయా ఫాస్ట్ ఎఫ్3 వంటివి ఉన్నాయి. లాంబ్రెట్టా వి200 అనే మరో స్కూటర్ కూడా జూలై 2025లో విడుదల కానుంది, ఇది కూడా ఈ-యాక్సెస్‌కు పోటీగా నిలవనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories