
టాటా పంచ్, ఎక్స్టర్ గుండెల్లో నిద్రపోతున్న నిస్సాన్ మాగ్నైట్.. . 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో రచ్చ
Nissan Magnite : సిటీ ట్రాఫిక్‌లో కారు నడపడం అంటే క్లచ్ తొక్కి, గేర్లు మార్చలేక తలప్రాణం తోకకు వస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ ఆటోమేటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో, అత్యంత సురక్షితమైన, స్టైలిష్‌గా ఉండే ఆటోమేటిక్ ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా? అయితే నిస్సాన్ ఇండియా నుంచి వచ్చిన నిస్సాన్ మాగ్నైట్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కేవలం రూ.6.21 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత చవకైన ఆటోమేటిక్ ఎస్‌యూవీగా రికార్డు సృష్టించింది.
ఈ కారు కేవలం ధరలోనే కాదు, సేఫ్టీలో కూడా రారాజు అనిపించుకుంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టింగ్‌లో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. దీని స్ట్రాంగ్ బాడీ నిర్మాణం ప్రమాద సమయంలో ప్రయాణికులకు గట్టి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం నిస్సాన్ తీసుకున్న గొప్ప నిర్ణయం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలోనే అత్యున్నత భద్రత లభిస్తోంది. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి కార్లకు ఇది గట్టి పోటీనిస్తోంది.
ఇక మైలేజీ విషయానికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్ లీటరు పెట్రోల్‌కు 19.7 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది సిటీ డ్రైవింగ్‌కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఫీచర్ల పరంగా కూడా ఈ కారు ఎక్కడా తగ్గలేదు. 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ఆకర్షణీయమైన ఎల్-షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. లోపల 336 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ ఉండటంతో లాంగ్ ట్రిప్స్‌కు కూడా ఇది సరిగ్గా సరిపోతుంది.
ప్రస్తుతం నిస్సాన్ కంపెనీ ఈ కారుపై అదిరిపోయే ఆఫర్లను కూడా ప్రకటించింది. పాత కారును ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.55,000 వరకు బెనిఫిట్స్, అలాగే కార్పొరేట్ ఉద్యోగులకు మరో రూ.5,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, అదిరిపోయే ఫీచర్లు, అన్నింటికీ మించి 5-స్టార్ సేఫ్టీ ఉండటంతో బడ్జెట్ ఎస్‌యూవీ ప్రియులకు మాగ్నైట్ ఒక అద్భుతమైన ఎంపిక. ఆటోమేటిక్ గేర్ల సౌలభ్యంతో ట్రాఫిక్ టెన్షన్ లేకుండా ప్రయాణించాలనుకునే వారు ఈ కారును నిరభ్యంతరంగా పరిశీలించవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




