Royal Enfield Classic 650: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొంటున్నారా? ఆగండి.. త్వరలో 650 బైక్‌ వచ్చేస్తోంది

Royal Enfield Classic 650
x

Royal Enfield Classic 650: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొంటున్నారా? ఆగండి.. త్వరలో 650 బైక్‌ వచ్చేస్తోంది

Highlights

Royal Enfield Classic 650: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొంటున్నారా? అయితే, ఇంకొద్ది రోజులు ఆగితే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ వచ్చేస్తుంది. లేటెస్ట్...

Royal Enfield Classic 650: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొంటున్నారా? అయితే, ఇంకొద్ది రోజులు ఆగితే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ వచ్చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో ఈ బైక్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. ఇప్పటికే కంపెనీకి చెందిన కొందరు డీలర్లు దీని కోసం అనఫిషియల్ బుకింగ్స్ కూడా తీసుకోవడం ప్రారంభించారు. గత ఏడాది నవంబర్‌లో కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. ఇది క్లాసిక్ 350 బైకుకు పవర్‌ఫుల్ అప్‌గ్రేడ్ వెర్షన్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ఫీచర్స్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 స్టైల్, డిజైన్ క్లాసిక్ 350ని పోలి ఉంటాయి. ఇది టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, స్పోక్ రిమ్స్, న్యూట్రల్ రైడింగ్ ట్రయాంగిల్‌తో కూడిన రెట్రో డిజైన్‌ను కలిగి ఉంటుంది. అన్ని లైట్లు రౌండ్‌గా ఉంటాయి. హెడ్‌ల్యాంప్‌లు ఎల్‌ఈడీ యూనిట్‌తో వస్తాయి. మోటార్‌సైకిల్ సింగిల్ సీటుతో పాటు పిలియన్ సీట్ ఆప్షన్‌లలో రానుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ఇంజన్

క్లాసిక్ 650 ఇంజన్ విషయానికొస్తే... ఇది 648CC, పార్లల్-ట్విన్ ఇంజిన్‌తో ఉంది. 47hp పవర్, 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లో 14.8-లీటర్ సామర్థ్యంతో పెద్ద పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. మీరు ఈ మోటార్‌సైకిల్‌ను టీల్, వల్లమ్ రెడ్, బ్రంటింగ్‌థోర్ప్ బ్లూ, బ్లాక్ క్రోమ్ అనే 4 కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ ధర

ఈ 650 బైక్‌లో క్లాసిక్ 350 వంటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ కూడా ఉంది. సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు అందించారు. దీని సీట్ ఎత్తు 800MM, గ్రౌండ్ క్లియరెన్స్ 154MM ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ బరువు 243 కేజీలుగా ఉంది. ఈ విధంగా, ఇది కంపెనీ లైనప్‌లో అత్యంత భారీ మోడల్ కూడా. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 3.50 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories