Short Circuit In Car: కారులో షార్ట్ సర్క్యూట్‌.. ఇవి గమనించకుంటే ప్రమాదంలో పడుతారు..!

Remember These Things To Avoid Short Circuit In Car
x

Short Circuit In Car: కారులో షార్ట్ సర్క్యూట్‌.. ఇవి గమనించకుంటే ప్రమాదంలో పడుతారు..!

Highlights

Short Circuit In Car: కొన్నిసార్లు నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగుతాయి. దీనికి కారణం కారులో ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగడం.

Short Circuit In Car: కొన్నిసార్లు నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగుతాయి. దీనికి కారణం కారులో ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగడం. నిజానికి కారు మెయింటనెన్స్‌ సరిగ్గా లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ముందుగా షార్ట్‌ సర్క్యూట్‌కి గల కారణాలు తెలుసుకోవాలి. తర్వాత వాటిని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ రోజు కారులో షార్ట్‌ సర్క్యూట్‌ గురించి ఎలాంటి అవగాహన ఉండాలో తెలుసుకుందాం.

1. వైరింగ్ సరిగ్గా లేకపోవడం

కారు వైరింగ్‌లో లోపం ఏర్పడితే షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతుంది. కట్‌ అయిన వైర్లు, ఓపెన్ కనెక్షన్ లేదా చెడు కనెక్టర్ మొదలైన వాటి వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుంది.

2. తేమ ఏర్పడటం

కారు వైరింగ్ దెబ్బతినడానికి తేమ ప్రధాన కారణం అవుతుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్‌ సంభవిస్తుంది. తేమ వైర్లకు చేరినట్లయితే షార్ట్ సర్క్యూట్‌ జరుగుతుంది.

3. వైర్లు తప్పుగా ఇన్‌స్టాల్‌ చేయడం

కారులో వైర్లు తప్పుగా అమర్చడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. వైర్ ఇన్‌స్టాల్ చేయకూడని ప్రదేశంలో ఇన్‌స్టాల్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇది మెకానిక్ తప్పు. అందుకే అన్ని తెలిసిన గ్యారేజ్‌లో కారు రిపేర్ చేయించాలి.

4. దెబ్బతిన్న ఎలక్ట్రానిక్స్

పాడైపోయిన ఎలక్ట్రానిక్స్ కూడా షార్ట్ సర్క్యూట్లకు కారణం అవుతాయి. కారులోని ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం విరిగిపోయినప్పుడు అలాగే అది నీటితో నిండినప్పుడు ఇలా జరుగుతుంది.

షార్ట్ సర్క్యూట్ నివారణకు చర్యలు

1. వైరింగ్ తనిఖీ

కారు వైరింగ్‌ని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే సరిదిద్దుకోవాలి. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

2. తేమ నుంచి రక్షణ

కారును ఎల్లప్పుడు తేమ నుంచి రక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు కారును ఎండలో పార్క్ చేయాలి. దీనివల్ల తేమ తొలగిపోతుంది.

3. సరైన ఎలక్ట్రానిక్ పరికరాలు

కారులో ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేసే ముందు ఆ పరికరం కారుకు సరిపోతుందా లేదా నిర్ధారించుకోవాలి.

4. అధీకృత సేవా కేంద్రం

కారు వైరింగ్‌ని ఎల్లప్పుడూ అధీకృత సర్వీస్ సెంటర్‌లో తనిఖీ చేసి రిపేర్‌ చేయించాలి. ఎందుకంటే వారు ఇందులో నిపుణులు కానీ రోడ్డు పక్కన ఉండే చిన్నచిన్న షాపుల్లో ఇలాంటి మరమ్మతులు చేయించకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories