Fortuner Price : కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చిన టయోటా..రూ.68,000పెరిగిన ఫార్చ్యూనర్ ధర

Fortuner Price
x

Fortuner Price : కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చిన టయోటా..రూ.68,000పెరిగిన ఫార్చ్యూనర్ ధర

Highlights

Fortuner Price: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన ప్రముఖ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ (Fortuner) కొన్ని వేరియంట్ల ధరలను సవరించింది.

Fortuner Price: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన ప్రముఖ ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ (Fortuner) కొన్ని వేరియంట్ల ధరలను సవరించింది. ఫార్చ్యూనర్ రేంజ్‌లో మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్లను రూ.44.77 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ త్రీ-రో ఎస్‌యూవీ ధర దాదాపు రూ.68,000 పెరిగింది. ఈ కొత్త ధరలు స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌తో పాటు ఫార్చ్యూనర్ లెజెండర్(Fortuner Legender)రేంజ్‌కు కూడా వర్తిస్తాయి. ఈ ధరల పెంపుతో ఫార్చ్యూనర్‌ను కొనుగోలు చేయడం మరింత ఖరీదైనదిగా మారింది.

ఫార్చ్యూనర్ ధరల పెంపు

టయోటా ఫార్చ్యూనర్ 4×2 పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ ధరలో రూ.68,000 పెరిగింది. ఇది ఈసారి జరిగిన ధరల పెంపులో అతి పెద్దది. దీనితో పాటు, 4×2 డీజిల్ మ్యాన్యువల్, 4×2 డీజిల్ ఆటోమేటిక్, 4×4 డీజిల్ మ్యాన్యువల్, GR-S, 4×4 డీజిల్ మ్యాన్యువల్ లెజెండర్, 4×4 ఆటోమేటిక్ లెజెండర్ వేరియంట్ల ధరలలో రూ.40,000 పెరిగాయి. ఈ ధరల పెంపు తర్వాత, టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఇప్పుడు రూ.36.05 లక్షల నుంచి రూ.52.34 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల మధ్య అందుబాటులో ఉంది.

ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు

ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 2.8-లీటర్ డీజిల్ మోటార్ తో అందుబాటులో ఉంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ కూడా ఉన్నాయి. ఈ జపనీస్ కార్ల తయారీ సంస్థ 4×4 డ్రైవ్‌ట్రైన్, లెజెండర్ వేరియంట్లను కేవలం డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందిస్తుంది.

టయోటా ఫార్చ్యూనర్ ప్రత్యేకతలు

టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ రోడ్డుపై పవర్ ఫుల్ ఎగ్జిస్టెన్స్, లగ్జరీ ఎక్స్ పీరియన్స్ ఒకే సారి కోరుకునే వారికి మొదటి ఆప్షన్ గా మారింది.

బోల్డ్ డిజైన్: ఫార్చ్యూనర్ బోల్డ్ , మస్కులర్ డిజైన్ దీన్ని జనంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. దీని ఎత్తు, స్పేసియస్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్‌లైట్లు, పటిష్టమైన వీల్ ఆర్చెస్ దీనికి ఒక డోమినెంట్ అప్పియరెన్స్ ఇస్తాయి.

ఆఫ్-రోడింగ్ కెపాసిటీ: దీని గ్రౌండ్ క్లియరెన్స్,బాడీ ఫ్రేమ్ దీన్ని అన్ని రకాల రోడ్లలోనూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఆఫ్-రోడింగ్‌కు ఇది అద్భుతమైనది.

పర్ఫామెన్స్ : ఫార్చ్యూనర్‌లో శక్తివంతమైన డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు లభిస్తాయి, ఇవి అద్భుతమైన పిక్-అప్, టార్క్‌ను అందిస్తాయి. ముఖ్యంగా దీని 4×4 వేరియంట్ ఆఫ్-రోడింగ్ కోసం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది సుదూర ప్రయాణాలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

క్వాలిటీ, మెయింటెనెన్స్: టయోటా కార్లు క్వాలిటీతో పాటు లో మెయింటెనెన్స్ కాస్ట్ కలిగి ఉంటాయి. ఈ కారణంగా ఫార్చ్యూనర్ రీసేల్ విలువ (Resale Value) కూడా చాలా బాగుంటుంది. దీని విడిభాగాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. సర్వీస్ నెట్‌వర్క్ కూడా బలంగా ఉంది. ఈ ధరల పెంపు తర్వాత కూడా ఫార్చ్యూనర్ తన ప్రత్యేకతలను, నమ్మకాన్ని కొనసాగిస్తుందని టయోటా ఆశిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories