Ola Roadster X: పెట్రోల్ బైక్‌లకు ఇక టాటా.. 500 కిమీ దూసుకెళ్లే ఎలక్ట్రిక్ బైకులు వచ్చేశాయ్

Ola Roadster X models and prices, Electric bikes, Electric scooters
x

Ola Roadster X: పెట్రోల్ బైక్‌లకు ఇక టాటా.. 500 కిమీ దూసుకెళ్లే ఎలక్ట్రిక్ బైకులు వచ్చేశాయ్

Highlights

Ola Roadster X Launched: బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్‌కు నంబర్ 1 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా పేరుంది. కంపెనీకి చెందిన 'ఎస్1' సిరీస్...

Ola Roadster X Launched: బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్‌కు నంబర్ 1 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా పేరుంది. కంపెనీకి చెందిన 'ఎస్1' సిరీస్ ఈ-స్కూటర్లు ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు, కంపెనీ సరికొత్త 'రోడ్‌స్టర్ ఎక్స్' ఈ-బైక్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ డిజైన్, ఫీచర్లు ఈవీ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ సరసమైన ధరకే అందుబాటులో ఉంది.

ఓలా కొత్త రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను రెండు వేరియంట్‌లలో పరిచయం చేసింది. రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్. స్టాండర్ట్ Ola రోడ్‌స్టర్ X ఈ-మోటార్‌సైకిల్ మోడల్‌ పవర్‌ఫుల్ 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5 కిలోవాట్, బ్యాటరీ ప్యాక్స్‌లో లాంచ్ అయింది. ఈ వేరియంట్ల ఎక్స్-షోరూమ్‌ ధరలు వరుసగా రూ.75,000, రూ.85,000, రూ.95,000 గా ఉన్నాయి.

కొత్త Ola రోడ్‌స్టర్ X ఈ-మోటార్‌సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 252 కిమీల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 125 కిమీ వరకు వెళ్తుంది. 11 కిలోవాట్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అలానే రివర్స్‌ మోడ్‌ కూడా అందించారు.

కొత్త రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఇది అన్ని-LED ల్యాంప్స్, 4.3-అంగుళాల LCD సెగ్మెంట్ డిస్‌ప్లే, Ola మ్యాప్ నావిగేషన్ (టర్న్-బై-టర్న్), క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, OTA అప్‌డేట్‌లతో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది.

ఈ Ola రోడ్‌స్టర్ X ఈ-మోటార్‌సైకిల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ సెటప్ ఆప్షన్‌తో వస్తుంది. భద్రత కోసం ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. అదనంగా సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్-బై-వైర్ సిస్టమ్‌ను చూడొచ్చు.

ఓలా రోడ్‌స్టర్ X ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ మోడల్‌లో 4.5 కిలోవాట్, 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. వీటి ఎక్స్‌షోరూమ్‌ ధరలు వరుసగా రూ. 1,04,999, రూ. 1,54,999 గా ఉన్నాయి. ఫుల్ ఛార్జింగ్‌పై 501 కిమీ వరకు ప్రయాణించవచ్చు.

మొత్తంమీద, ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఈ-మోటార్‌సైకిల్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంది. బుకింగ్ కూడా నేటి నుంచి ప్రారంభం కాగా, వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పెద్ద కంపెనీల నుండి ప్రత్యక్ష పోటీ లేనందున రికార్డ్ సంఖ్యలో సేల్స్ జరుగుతాయని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories