Diplos Max: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 140 కిమీ మైలేజ్..!

Diplos Max: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 140 కిమీ మైలేజ్..!
x
Highlights

Diplos Max: న్యూమెరోస్ మోటార్స్ తన మల్టీ యుటిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిప్లోస్ మ్యాక్స్‌ను విడుదల చేసింది.

Diplos Max: న్యూమెరోస్ మోటార్స్ తన మల్టీ యుటిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిప్లోస్ మ్యాక్స్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.112,199గా నిర్ణయించింది. కంపెనీకి ఇదే మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది కంపెనీ ఫ్లాగ్‌షిప్ డిప్లొస్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.7 కిలోవాట్ కెపాసిటీ గల లిథియం బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

భద్రత, విశ్వాసం, స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ డిప్లొస్ మ్యాక్స్‌ను రూపొందించింది. సమాచారం ప్రకారం.. కంపెనీ త్వరలో అతిపెద్ద ఈవీ పైలట్ టెస్ట్ నిర్వహించనుంది. ఈ టెస్ట్‌లో 13.9 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ స్కూటర్ అనేక రకాల ప్రయాణాలకు గొప్ప ఆప్షన్. బైక్ ఛాసిస్, బ్యాటరీ, మోటారు, కంట్రోలర్‌లు చాలా కాలం పాటు స్థిరమైన పనితీరును అందించడానికి జాగ్రత్తగా రూపొందించారు.

డిప్లోస్ మ్యాక్స్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రత విషయానికి వస్తే.. డిప్లోస్ ప్లాట్‌ఫామ్‌లో మెరుగైన స్టాపింగ్ పవర్ కోసం డబుల్ డిస్క్ బ్రేక్‌లు, విజిబిలిటీ, థెఫ్ట్ అలర్ట్ కోసం హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ ఎల్ఈడీ లైటింగ్, జియోఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి రైడర్‌కు సురక్షితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

న్యూమెరోస్ మోటార్స్ ప్రస్తుతం 14 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 170 మంది డీలర్లను నియమించుకోవడం ద్వారా తన విక్రయాలు, సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని భావిస్తోంది. డిప్లాస్ ప్లాట్‌ఫామ్ మరొక గొప్ప లక్షణం స్థిరత్వం. బలమైన చక్రాలు, వెడల్పాటి టైర్లు వివిధ భూభాగాలపై మెరుగైన గ్రిప్‌ను అందిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories