Kia EV6: అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందో.. ఈ కారును ఒక్కరు కూడా కొనలేదు

Kia EV6, Kia India, Automobiles
x

Kia EV6: అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందో.. ఈ కారును ఒక్కరు కూడా కొనలేదు

Highlights

Kia EV6: కియా కార్లకు దేశంలో చాలా మంచి కస్టమర్ బేస్ ఉంది. కంపెనీ గత నెల జనవరి అమ్మకాల గురించి మాట్లాడినట్లయితే.. కియా ఫేమస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ...

Kia EV6: కియా కార్లకు దేశంలో చాలా మంచి కస్టమర్ బేస్ ఉంది. కంపెనీ గత నెల జనవరి అమ్మకాల గురించి మాట్లాడినట్లయితే.. కియా ఫేమస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్‌ 7,000 కంటే ఎక్కువ మంది ఇళ్లకు చేరింది. అదే సమయంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్ కూడా 6,000 కంటే ఎక్కువ మంది కొన్నారు. అయితే, ఇదే సమయంలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా EV6ని ఒక్కరు కూడా కొనలేదు. కియా EV6 5-సీటర్ ఎలక్ట్రిక్ కారు. కియా EV6 ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర తదిరత వివరాలు తెలుసుకుందాం.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్, 14-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు , సన్‌రూఫ్ ఉన్నాయి. భారత్ మార్కెట్లో ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 60.97 లక్షల నుండి రూ. 65.97 లక్షల వరకు ఉంటుంది.

ప్రయాణీకుల భద్రత కోసం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 8-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాస్ టెక్నాలజీ, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో కియా ఈవీ6.. బీఎమ్‌డబ్లూ i4, హ్యుందాయ్ Ioniq 5 వంటి ఈవీలతో పోటీపడుతుంది.

ఎస్‌యూవీ పవర్ ట్రెయిన్ విషయానికి వస్తే ఈ కారులో 77.4కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల రేంజ్‌ని కవర్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ కారు 50 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జర్‌తో 1 గంట 13 నిమిషాలలో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయచ్చు. లోకల్ సాకెట్ నుండి ఫుల్ ఛార్జ్ చేయడానికి 36 గంటలు పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories