New Suzuki Access 125: సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్.. కొత్త లుక్ చూశారా..

New Suzuki Access 125: Bharat Mobility  introduced  Access 125 at the Global Expo
x

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్.. కొత్త లుక్ చూశారా..

New Suzuki Access 125: సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్.. కొత్త లుక్ చూశారా..

Highlights

125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్ 125 బెస్ట్ సెల్లర్. చాలా కాలంగా ఈ స్కూటర్‌ను అప్‌డేట్ చేయలేదు, కానీ ఇప్పుడు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో యాక్సెస్ 125 2025 వెర్షన్‌ను పరిచయం చేసింది

New Suzuki Access 125: 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్ 125 బెస్ట్ సెల్లర్. చాలా కాలంగా ఈ స్కూటర్‌ను అప్‌డేట్ చేయలేదు, కానీ ఇప్పుడు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో యాక్సెస్ 125 2025 వెర్షన్‌ను పరిచయం చేసింది. ఈసారి దాని డిజైన్, ఫీచర్లలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఈ స్కూటర్ 3 వేరియంట్లలో విడుదలైంది. యాక్సెస్ 125 ధర రూ. 81,700 నుండి రూ. 93,300 మధ్య ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి?

కొత్త యాక్సెస్ స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.81,700 నుండి ప్రారంభమవుతుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది LCD ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్, USB ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ లైట్, డ్యూయల్ యుటిలిటీ పాకెట్లను ముందు భాగంలో కలిగి ఉంది. భద్రత కోసం స్కూటర్‌లో CBS సిస్టమ్, పార్కింగ్ బ్రేక్, సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్ ఉన్నాయి. ఈ స్కూటర్‌ పెరల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ కలర్ లలో మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి.కొత్త యాక్సెస్ స్పెషల్ ఎడిషన్ ధర రూ.88,200. ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సౌకర్యాన్ని కలిగి ఉంది. బేస్ మోడల్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది.

సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర రూ.93,300. ఇందులో మీరు చాలా మంచి ఫీచర్లను చూడబోతున్నారు. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీ ఫీచర్ ఉంది. దీంతో వినియోగదారులు కాల్స్, ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ అలర్ట్‌లు, ఓవర్ స్పీడింగ్ అలర్ట్‌లు, వెదర్ అప్‌డేట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్‌లను పొందుతారు. ఈ స్కూటర్‌లో డిజిటల్ వాలెట్ కూడా ఉంది. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సాఫ్ట్ కాపీలను ఉంచవచ్చు.

కొత్త సుజుకి యాక్సెస్ 125 డిజైన్ ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తోంది. ఇది స్మార్ట్, స్లిమ్‌గా మారింది. ఇందులో 124సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 8.4బిహెచ్‌పి పవర్, 10.2ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్‌తో ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్, వెనుకవైపు స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories